Karnataka Style Vegetable Pulao for Lunch Box : హెల్తీ ఫుడ్ తీసుకోవాలనుకున్నప్పుడు.. కర్ణాటక స్టైల్ వెజిటబుల్ పులావ్ రైస్ తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. అంతేకాకుండా దీనిలో ఉపయోగించే కూరగాయలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. బ్యాచిలర్స్​ కూడా ఈజీగా దీనిని చేసుకోవచ్చు. ఇది హెల్తీ మాత్రమే కాదు.. టేస్టీ రెసిపీ కూడా. మరి ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు 


బియ్యం - రెండు కప్పులు


నీరు - 3 కప్పులు 


ఉప్పు - రుచికి తగినంత 


నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు 


ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు


క్యారెట్ - 1 పెద్దది


బీన్స్ - 10


బంగాళదుంప - 1 పెద్దది


స్టార్ పువ్వు - 1 


లవంగాలు - 4


యాలకులు - 2


జాపత్రి - కొంచెం 


బిర్యానీ ఆకు - 1


పచ్చిమిర్చి - 5


తాజా కొబ్బరి - అరకప్పు


పుదీనా ఆకులు - గుప్పెడు


కొత్తిమీర - గుప్పెడు


వెల్లుల్లి రెబ్బలు - 8


అల్లం - రెండు అంగుళాలు


జీలకర్ర - అర టీస్పూన్


తయారీ విధానం


ముందుగా బాస్మతి రైస్​ని కడిగి ఓ అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయను, పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకోవాలి. క్యారెట్, బంగాళదుంపను పైన తొక్క తీసి.. క్యూబ్స్​ మాదిరిగా కోసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దానిలో పచ్చిమిర్చి, కొబ్బరి, పుదీనా ఆకులు, కొత్తిమీర, పొట్టు తీసిన వెల్లుల్లి, అల్లం, జీలకర్ర వేసి పేస్ట్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి లేకుంటే ఎండుకొబ్బరి తీసుకుని దానిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 


ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కుక్కర్ పెట్టాలి. దానిలో నెయ్యి వేయాలి. అది కరిగి వేడి అయ్యాక దానిలో లవంగాలు, జాపత్రి, యాలకులు, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత దానిలో ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దానిలో క్యారెట్, బంగాళదుంప ముక్కలు వేసి ఫ్రై చేయాలి. బీన్స్ కూడా వేసి ఉడికించుకోవాలి. అవి కాస్త మగ్గిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. 


కొత్తిమీర పేస్ట్​ని ముక్కలు పట్టేలా బాగా కలిపి రెండు నిమిషాలు ఉండికించాలి. ఇప్పుడు దానిలో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కలపాలి. వెంటనే బియ్యానికి సరిపడ నీళ్లు వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు దానిలో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మరోసారి కలిపి కుక్కర్ మూత పెట్టేయాలి. రెండు విజిల్స్ వచ్చేవరకు మీడియం మంట మీద దానిని ఉడికించుకోవాలి. అంతే టేస్టీ, హెల్తీ వెజిటేబుల్ రైస్ రెడీ. 



లంచ్​ బాక్స్ కోసం దీనిని రెగ్యూలర్​గా చేసుకోవచ్చు. పైగా ఇది హెల్తీ కూడా. పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటారు. పెద్దలు కూడా మెచ్చుకోగలిగే రెసిపీ. బ్యాచిలర్స్​ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనిని రైతాతో కలిపి తీసుకోవచ్చు. లేదంటే ఏ కర్రీతో అయినా దీనిని కలిపి తీసుకోవచ్చు. కొందరు దీనిని ఆవకాయతో కలిపి కూడా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని చేసి ఆస్వాదించేయండి.


Also Read : బొప్పాయి ఆకులరసాన్ని పరగడుపున తీసుకుంటే ఎన్ని లాభాలో.. బ్లడ్ షుగర్ ఉన్నవారికి ఇంకా మంచిదట