Which country owns the most gold in the world What is India Place : ప్రపంచంలో అత్యధిక దేశాలు విదేశీ మారకద్రవ్యాల రిజర్వులుగా పెట్టుకుంటాయి. ఎక్కువ దేశాలు డాలర్స్ రూపంలోనే ఇవి లెక్కలేసుకుంటాయి. కానీ అన్ని దేశాలు బంగారాన్ని వీలైనంత ఎక్కువగా దాచి పెట్టుకుంటూ ఉంటాయి. సాధారణ కుటంబాలు ఎలాగో.. ప్రపంచంలోని అన్ని దేశాలు అంతే. ఎందుకంటే. .. కరెన్సీ విలువ పడిపోతుందేమో కానీ బంగారం విలువ మాత్రం పడిపోదు. ప్రపంచంలో అత్యధిక బంగారం రిజర్వు ఉన్న దేశం సహజంగానే అమెరికా. ఎందుకంటే ఆ దేశం దగ్గర భారీగా డాలర్లు ఉంటాయి కాబట్టి దొరికినంత కొని దాచి పెట్టేసుకుంటున్నారు. ఇలా అమెరికా వద్ద 8966 టన్నుల బంగారం ఉంది.
అమెరికా తర్వాత రెండో స్థానంలో అత్యధిక బంగారం రిజర్వులు ఉంచుకున్న దేశం జర్మనీ. అయితే ఆ దేశం వల్ల ఉన్నది 3696 టన్నులు మాత్రమే. అంటే.. మొదటి స్థానంలో ఉన్న అమెరికా కన్నా ఐదు వేల టన్నులు తక్కువ.ఈ లెక్క ప్రకారం చూస్తే అమెరికాను ఈ మధ్య కాలంలో ఎవరూ బీట్ చేయలేరు. అంత ఎక్కువగా అమెరికా వద్ద బంగారం ఉంది. ఇక మూడో స్థానంలో ఉన్నది దేశం కాదు.. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ప్రపంచదేశాలకు ఆర్థిక సాయం చేసే ఐఎంఎఫ్ వద్ద 3102 టన్నుల బంగారం రిజర్వ్ ఉంది.
ఇక నాలుగో స్థానంలో యూరోపియన్ కంట్రీ ఇటలీ ఉంది. ఈ దేశం వద్ద 2703 టన్నుల బంగారం ఉంది. ఐదో స్థానంలో ఉన్న ఫ్రాన్స్ వద్ద 2686 టన్నుల బంగారం ఉంది. ఆరో స్థానంలో రష్యా ఉంది. వ్లాదిమిర్ పుతిన్ తమ దేశ సంపదను బంగారంలోకి మార్చడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. రష్యా వద్ద 2568 టన్నుల బంగారం ఉంది. మాములుగా అయితే చైనా ఇలాంటి అంశాల్లో చాలా ముందు ఉంటుంది. ఎందుకో కానీ బంగారం నిల్వల విషయంలో అమెరికాతో పోటీ పడలేకపోయింది. ఏడో స్థానంలో 2355 టన్నుల బంగారం మాత్రమే ఉంచుకోగలిగింది. ఎనిమదో స్థానంలో స్విట్టర్ ల్యాండ్ 1146 టన్నుల బంగారం, తొమ్మిదో స్థానంలో ఉన్న జపాన్ వద్ద 993 టన్నుల బంగారం ఉంది.
టాప్ 9లో భారత్ లేదు.. కానీ టాప్ టెన్‌లో ఉంది. అంటే.. పదో స్థానంలో భారత్ ఉంది . భారత్ వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలు 879 టన్నులు. అయితే ఈ పది ర్యాంకులు పూర్తిగా .. ప్రభుత్వాల వద్ద ఉన్న బంగారం రిజర్వుల గురించి మాత్రమే. ప్రజల వద్ద ఉన్న బంగారం కాదు. ఆయా దేశాల్లో ప్రజలు బంగారం పెట్టుబడిగా పెడతారు. ఇండియన్స్ మాత్రం అదో సెంటిమెంట్ గా కొనుగోలు చేస్తూంటారు . అందుకే ప్రజల వద్ద ఉన్న బంగారాన్ని కూడా కలుపుకుంటే.. అమెరికా వద్ద ఉన్నంత బంగారం ఇండియాకు కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు.