Ammayi garu Serial Today Episode విరూపాక్షి రాఘవని తీసుకొస్తుంటే దీపక్ రాఘవని తీసుకొని వెళ్లిపోతాడు. విరూపాక్షి రాజుకి విషయం చెప్పాలని రాజు, శ్వేతల పెళ్లి దగ్గరకు వెళ్తుంది. రాజుని పెళ్లి పీటల మీద నుంచి లేవమని ఇంకా మీ పెద్దయ్య గారి మీద నమ్మకం ఉందా ఆయన రారు అని చెప్తుంది. 


విరూపాక్షి: ఆయన మారరు ఆయన మీద ఆశలు పెంచుకోవడం మనకే నష్టం రాఘవ కూడా తప్పించుకున్నాడు నువ్వు లే ఫస్ట్.
జీవన్: ఏంటి ఆంటీ ఇది ఇలా పీటల మీద పెళ్లి ఆపడం న్యాయమేనా.
ముత్యాలు: నువ్వేం కంగారు పడకు జీవన్ నా కొడుకు నా మాట వింటాడు.
విరూపాక్షి: ముత్యాలు నీకు మతి పోయిందా పెళ్లైన రాజుకి మళ్లీ పెళ్లి ఏంటి. శ్వేత ఈ పెళ్లి జరిగితే నీ బతుకు అన్యాయం అయిపోతుంది. అందుకే సాటి ఆడదాని జీవితం కూడా అన్యాయం అవ్వడం ఇష్టం లేదు అందుకే ఈ పెళ్లి ఆపుతున్నా. రాజు నీతో ఈ పెళ్లి ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నాడు అనుకుంటున్నావా కాదు వాళ్ల పెద్దయ్య గారు వచ్చి పెళ్లి ఆపి తనని రూపని ఒకటి చేస్తారనే నమ్మకంతో పీటల మీద కూర్చొన్నాడు. రాజు ముఖంలో నవ్వు ఉందా రాజు కళ్లలో ఆనందం ఉందా.
జీవన్: చూడండి ఎవరు ఏమనుకున్నా ఈ పెళ్లి అవుతుంది. 


విరూపాక్షి జీవన్‌ని తిట్టు రాజు చేయి పట్టుకొని పైకి లేపుతుంది. దాంతో జీవన్ అడ్డుకొని నేను చాలా పెద్ద వెధవని మీరు ఇప్పుడు వెళ్లకపోతే నేను ఎంత పెద్ద వెదవనో చూస్తావని విరూపాక్షిని పట్టుకొని బయటకు విసిరేస్తాడు. ఇంతలో సూర్యప్రతాప్, రూప వాళ్లు వస్తారు. సూర్య ప్రతాప్ విరూపాక్షిని పట్టుకుంటాడు. విరూపాక్షి భర్తని చూసి షాక్ అయిపోతుంది. అందరూ సూర్య ప్రతాప్ రాకు బిత్తర పోతారు. 


ఫ్లాష్‌ బ్యాక్‌లో..
 
రూప తాను తీసిన వీడియో అప్పుడే తన తండ్రికి పంపిస్తుంది. దాంతో అది చూసి సూర్య ప్రతాప్ షాక్ అవుతాడు. అంతే కాకుండా రూప తన లొకేషన్ కూడా పంపడంతో సూర్య ప్రతాప్ ఆ లొకేషన్‌కి వెళ్లి కిడ్నాప్ అయిన రూపని కాపాడుతాడు. ఇక సూర్యప్రతాప్ రిపోర్టర్, కలెక్టర్‌ని అరెస్ట్ చేయించి గుడికి తీసుకురమ్మని చెప్తాడు. ముత్యాలు తాళి కట్టమని అంటే సూర్య ప్రతాప్ ఆపుతాడు. నేను పెళ్లి ఆపింది రాజు కోసం కాదు ఈ అన్నా చెల్లెల్లు చేసిన పని గురించి అని చెప్తాడు. వాళ్లు ఏం చేసినా మాకు సంబంధం లేదు ఈ పెళ్లి అవ్వాలి అంటుంది ముత్యాలు. ఆర్ ఆర్ కంపెనీ కూలగొట్టించింది వీళ్లే అని తెలిసినా ఈ పెళ్లి జరిపిస్తారా అత్తయ్యా అని రూప అడుగుతుంది. అందరూ షాక్ అయిపోతారు. రూప వీడియోని ముత్యాలుకి చూపిస్తుంది అందరూ షాక్ అయిపోతారు.


ఇదంతా ఫేక్ అని జీవన్ ముత్యాలుతో చెప్తాడు. దాంతో రూపని ఎందుకు బంధించావ్ అని సూర్య ప్రతాప్ అడుగుతారు. జీవన్ చెంప పగలగొడతాడు. కలెక్టర్, విలేకర్ని తెప్పించి సాక్ష్యం చెప్పడంతో అందరూ శ్వేత, జీవన్ తప్పులను గుర్తిస్తారు. ముత్యాలు శ్వేత చెంప పగలగొడుతుంది. రాజు, అప్పలనాయుడు సూర్యప్రతాప్‌కి థ్యాంక్స్ చెప్తారు. పోలీసులు అన్నాచెల్లెల్ని అరెస్ట్ చేస్తారు. ఇక సూర్య ప్రతాప్ సీఎంగా తన వల్ల పొరపాటు జరిగింది కాబట్టి ఆ కంపెనీ మళ్లీ కటిస్తా అంటాడు. దానికి అప్పలనాయుడు భార్యకి విరూపాక్షి సూర్య ప్రతాప్‌కి రాజు, రూపల కాపురం గురించి ఆలోచించమని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీ, మిత్రలను ఒకే బెడ్ మీద అలా చూసేసిన మనీషా.. జానుతో పెళ్లికి వివేక్ ఏర్పాట్లు!