Top 5 Emojis : ఎస్సెమ్మెస్‌ల కాలంలో స్పెల్లింగ్‌లు తగ్గించేసి ఇంగ్లిష్‌ను ఖూనీ చేసేవాళ్లు. వాట్సాప్ కాలంలో అసలు లాంగ్వేజ్ లేకుండా ఎమోజీలతోనే మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. వాట్సాప్‌లలోనే కాదు సోషల్ మీడియాలో ఏదైనా రియాక్షన్ పెట్టాలన్నా ఎక్కువ మంది ఎమోజీలనే ఉపయోగిస్తున్నారు.   సింగిల్‌ ఎమోజీతో మన భావాలను వ్యక్తం చేయడం వీటి ప్రత్యేకత. కోపం వస్తే, నవ్వితే, అలిగితే, ఏడిస్తే, బాధపడితే, తినాలనిపిస్తే, ప్రేమ, సిగ్గుపడటం ఇలా అన్ని రకాల భావాలను ఎమోజీల ద్వారానే వ్యక్తపరుస్తున్నారు. 


పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఆ గిరిజనుడి ఇద్దరు భార్యలు.. మూడో ఆమె కూడా!


సోషల్‌ మీడియా నుంచి ఎస్‌ఎంఎస్‌ల వరకూ వీటిని విరివిగా వినియోగిస్తున్నారు. ఇప్పుడీ ఎమోజీల గురించి ఎందుకంటే.. నేడు ప్రపంచ ఎమోజీ దినోత్సవం. 2014 నుండి ప్రతి ఏడాది జులై 17న ప్రపంచ ఎమోజీడేని జరుపుకుంటున్నారు. వరల్డ్‌ ఎమోజీ డే  సందర్భంగా అమెరికాకు చెందిన ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ జంబుల్‌ ఏ ఎమోజీని ఎక్కువగా వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకు ఓ సర్వే చేపట్టింది. కరోనా కారణంగా ఎమోజీల వినియోగం 2020 నుంచి 2021 మధ్యకాలంలో 86 శాతానికి పెరగడంతో పాటు సోషల్‌ మీడియా, ఇతర సైట్లలో యాక్టివ్‌గా ఉన్నట్లు నిర్ధారించింది. 


మసీదులో పూజలకు అనుమతినివ్వాలన్న పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ-ఎప్పుడంటే?


భారతీయులు ఎక్కువగా క్లాసిక్‌ రెడ్‌ హార్ట్‌ ఎమోజీని వాడుతున్నట్లు తెలిపింది. అయితే ఈ ఎమోజీని వాడేవారిలో ఎక్కువగా యువత ఉన్నారని జంబుల్‌ సంస్థ వివరించింది. రెడ్‌ హార్ట్‌, కన్నుగీటేది, కన్నీళ్లతో ఉన్న ఎమోజీ, సన్‌ గ్లాసెస్‌ ఎమోజీ, కళ్లతో నవ్వే స్మైల్‌వి ప్రస్తుతం భారత్‌లో వాడుతున్న టాప్‌-5 ఎమోజీలు.  


ఎమోజీ డే సందర్భంగా నెటిజన్లు పెద్ద ఎత్తున తమ భావాల్ని ఎమోజీ రూపంలో షేర్ చేసుకున్నారు.