Punjab New Traffic Rules: సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే ఏం చేస్తారు? జరిమానా విధిస్తారు లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. ఒక్కోసారి జైలుకు పంపుతారు. అయితే ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి కొత్త శిక్ష వచ్చింది. అదేంటో తెలుసా? రక్తదానం. అవును ఇక  ఓవర్‌ స్పీడ్‌తో వాహనాలు నడిపినా, తాగి డ్రైవింగ్ చేసినా.. రక్తదానం చేయాల్సిందే.


ఇవీ శిక్షలు


పంజాబ్‌ ప్రభుత్వం మందు బాబుల కోసం కొత్త శిక్ష అమలు చేస్తోంది. ఓవర్‌ స్పీడ్‌ డ్రైవింగ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ. 1000, మళ్లీ దొరికితే రూ. 2,000 చొప్పున ఫైన్‌ ఉంటుంది. అయితే మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేస్తూ దొరికితే మొదటిసారి రూ. 5,000, తర్వాత రూ. 10,000 విధిస్తారు.


అంతేకాదు వీటితో పాటు వారికి వివిధ రకాల శిక్షలు కూడా ఉంటాయి. సమీపంలోని స్కూళ్లలో కనీసం 20 మంది విద్యార్థులకు 2 గంటలకు పైగా పాఠాలు బోధించాలి. అది కుదరకపోతే ఓ ఆసుపత్రిలో కనీసం 2 గంటల పాటు సామాజిక సేవ చేయాలి. అది కాకపోతే ఒక యూనిట్‌ రక్తం దానం కూడా చేయాల్సి ఉంటుంది. ఈ శిక్షలతో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.


తగ్గించేందుకు


పంజాబ్‌లో యాక్సిడెంట్లను తగ్గించేందుకు, సమాజసేవను పెంచేందుకు ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ఓవర్‌ స్పీడ్ లేదా మద్యం, మాదకద్రవ్యాల ప్రభావంతో డ్రైవింగ్ చేస్తే ఇక నుంచి ఈ శిక్షలు అమలు కానున్నాయి.


ఓవర్ స్పీడ్



  • వేగ పరిమితిని మించితే మొదటి నేరానికి రూ.1,000 జరిమానా, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్.

  • మద్యం తాగి వాహనం నడిపితే 3 నెలల పాటు లైసెన్స్ సస్పెన్షన్, రూ.5,000 జరిమానా. 

  • ఇక రెండోసారి అతివేగానికి రూ.2,000 ఫైన్‌, మళ్లీ మూడు నెలల పాటు లైసెన్స్ సస్పెన్షన్‌.

  • మరోసారి మద్యం సేవించి వాహనం నడిపితే సస్పెన్షన్‌తో పాటు రూ. 10,000 జరిమానా.

  • వీటితో పాటు ప్రతి నేరానికి సమీపంలోని పాఠశాలలో కనీసం 20 గంటల పాటు 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు కనీసం 20 మంది విద్యార్థులకు బోధించాలి.

  • దీనికి అదనంగా సమీపంలోని ఆసుపత్రిలో కనీసం రెండు గంటలపాటు సమాజ సేవ చేయాలి.

  • లేదా సమీపంలోని బ్లడ్ బ్యాంక్‌లో కనీసం ఒక యూనిట్ రక్తాన్ని దానం చేయాల్సి ఉంటుంది 


Also Read: Defamation Complaint Filed Against RGV: కొంపముంచిన ఆ ట్వీట్- RGVపై పరువు నష్టం దావా!