Jammu Kashmir Poonch: జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నియంత్రణ రేఖ వద్ద ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు ఆర్మీ అధికారులు మృతి చెందారు.
ఇదీ జరిగింది
పూంచ్‌లోని మెంధార్ సెక్టార్‌లో ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. గ్రెనేడ్ పేలడంతో ఆర్మీ కెప్టెన్, జూనియర్ కమిషన్‌డ్ ఆఫీసర్ మృతి చెందినట్లు సైన్యం సోమవారం ప్రకటించింది.
గ్రెనేడ్ పేలిన సమయంలో ఇతర సైనికులతో కలిసి ఆర్మీ కెప్టెన్ ఆనంద్‌తో పాటు నాయబ్ సుబేదార్ (JCO) విధులు నిర్వహిస్తున్నారని ఢిపెన్స్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు.
చికిత్స పొందుతూ
ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని హెలికాప్టర్‌లో ఉధంపూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఇద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందారని అధికారులు పేర్కొన్నారు. విధులు నిర్వహిస్తూ అత్యున్నత త్యాగం చేసిన అధికారులను జనరల్ ఆఫీసర్ కమాండింగ్, వైట్ నైట్ కార్ప్స్‌కు చెందిన అన్ని ర్యాంకుల అధికారులు నివాళులర్పించాారు. మృతుల కుటుంబాలకు సైన్యం ప్రగాఢ సానుభూతి తెలిపింది.
Also Read: Madhya Pradesh Bus Accident: నర్మదా నదిలో పడిన బస్సు- 12 మంది మృతి!
Also Read: Parliament Monsoon Session: 'ఇది చాలా ముఖ్యమైన సమయం- దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్దాం'