Madhya Pradesh Bus Accident: నర్మదా నదిలో పడిన బస్సు- 13 మంది మృతి!

ABP Desam   |  Murali Krishna   |  18 Jul 2022 01:53 PM (IST)

Madhya Pradesh Bus Accident: ఓ బస్సు అదుపుతప్పి నర్మదా నదిలో పడిపోయింది. ఘటనలో 13 మంది మృతి చెందారు.

(Image Source: ANI)

Madhya Pradesh Bus Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఓ బస్సు నర్మదా నదిలో పడింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు.

ఇదీ జరిగింది

ఇందోర్ నుంచి పుణె వెళ్తున్న ఓ బస్సు వంతెన మీద నుంచి నర్మదా నదిలో పడింది. ధార్ జిల్లా ఖాల్ ఘాట్ వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు తెలిపారు. మరో 15 మంది రక్షించారు. అయితే మరో 23 మంది కోసం గాలింపు చేపట్టినట్లు మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు.

సీఎం దిగ్భ్రాంతి

ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.

అదుపుతప్పి బస్సు నర్మదా నదిలో పడిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.                                                             -    శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ సీఎం

Also Read: China Floods: చైనాను వణికిస్తోన్న వరదలు- 12 మంది మృతి

Also Read: Jammu Kashmir Poonch: ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలి ఇద్దరు ఆర్మీ అధికారులు మృతి

Published at: 18 Jul 2022 11:47 AM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.