Defamation Complaint Filed Against RGV: సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై పరువు నష్టం దావా వేశారు. ఎన్‌డీఏ (NDA) రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై అభ్యంతరక రీతిలో వర్మ ట్వీట్ చేశారని ముంబయి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 


పలు సెక్షన్లు


సుభాష్ రాజోరా అనే వ్య‌క్తి ఈ కేసు వేశారు. సెక్ష‌న్లు 499, 500 (ప‌రువు న‌ష్టం), 504 (ఉద్దేశ పూర్వ‌కంగా అవ‌మానించ‌డం), 506 (నేర‌పూరిత బెదిరింపున‌కు శిక్ష‌) కింద సుభాష్ రాజోరా ఈ కేసు వేసిన‌ట్లు ఆయ‌న న్యాయ‌వాది తెలిపారు.


వ‌ర్మ వ్యాఖ్య‌లు ఓ వర్గం ప్రజలను అవ‌మానించేలా ఉన్నాయ‌ని ఆయ‌న పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌ను అక్టోబ‌రు 11న ప‌రిశీలిస్తామ‌ని న్యాయమూర్తి తెలిపారు.


వివాదాస్పద ట్వీట్


ద్రౌపది ముర్ముపై ఆర్‌జీవీ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ కూడా ఫైర్ అయింది. రాష్ట్రపతి అభ్యర్థిపై ఆర్‌జీవీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది.


రామ్‌గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. NDA రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్మును కించపరిచే విదంగా వర్మ ట్వీట్ చేశారని ఫిర్యాదులో భాజపా నేతలు పేర్కొన్నారు. 


రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అబిడ్స్ పోలీసులను భాజపా నేతలు గూడూరు నారాయణరెడ్డి , మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కోరారు.


ఆర్‌జీవీ రియాక్షన్






అయితే తన వ్యాఖ్యలపై భాజపా ఫైర్ అవడంతో ఆర్‌జీవీ రియాక్ట్ అయ్యారు. తాను ఏ ఒక్కరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు.</p


నేను చేసిన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి చేసినవు కావు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు కాదు.                                                                                                                               "


-ఆర్‌జీవీ, సినీ దర్శకుడు