తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు కీలక దశకు వచ్చినట్టు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న కోర్టులో సీబీఐ వేసిన పిటిషన్ చూస్తే కేసు దర్యాప్తు తీరుతెన్నులు అర్థమవుతున్నాయి. కొందరి కీలక వ్యక్తుల పేర్లు అందులో పేర్కొనడంతో మరోసారి ప్రకంపనాలు మొదలయ్యాయి. అవన్నీ పక్కన పెడితే కేసు దర్యాప్తులో సీబీఐ పూర్తిగా సాంకేతికతపై ఆధార పడిందన్నది క్లియర్‌గా అర్థమవుతోంది. కాల్ డేటా, సెల్‌ఫోన్ లొకేషన్లు, ఇలా ఆనాడు నిందితుల కదలికలను ప్రతి అడుగునూ ట్రాక్ చేసినట్టు చెబుతోంది. దీనికి గూగుల్‌ టేకౌట్‌ యూజ్‌ చేసి కేసులో కీలక ఆధారాలు సేకరించినట్టు కోర్టుకు విన్నవించుకుంది. 


ఇంతకీ సీబీఐ వాడుకున్న ఆ గూగుల్‌ టేకౌట్ అంటే ఏంటీ? ఇది ఎలా ఉపయోగపడుతుంది. ఇది కేసు దర్యాప్తు అధికారులకేనా ఇంకా సామాన్యులకు కూడా ఇది ఉపయోగపడుతుందా లేదా?  
  
ఏదైనా కొత్తగా కనిపించినా.. ఏదైనా విషయంలో డౌట్స్‌ వచ్చినా వెంటనే గూగుల్‌లో సెర్చ్‌ చేస్తాం. ఏదైనా వస్తువు కొనాలన్నా కూడా గూగుల్‌లో రేటింగ్స్ చూసి మరీ కొంటాం. ఏదైనా తెలియని ప్రాంతానికి వెళ్లాలంటే కూడా గూగుల్‌ను ఆశ్రయిస్తాం. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ గూగుల్ దారి చూపించే గైడ్‌లా మారిపోయింది.  అలాంటి టూల్స్‌లో ఒకటే ఈ గూగుల్‌ టేకౌట్‌. 


ఏంటీ గూగుల్‌ టేకౌట్‌?


డేటాను సురక్షితంగా బ్యాకప్‌ చేయడానికి ఈ గూగుల్‌ టేకౌట్‌ అనే టూల్‌ను గూగుల్‌ అందిస్తోంది. ఇది పూర్తిగా ఉచితం. ఇది 51 రకాల డేటాను బ్యాకప్ చేస్తోంది. మెయిల్స్‌, డ్రైవ్ కంటెంట్‌, క్యాలెండర్స్, బ్రౌజర్‌లో ఉండే బుక్‌మార్క్స్‌, యూట్యూబ్‌లో మీరు రెగ్యులర్‌గా చూసే వీడియోలను కూడా బ్యాకప్ చేస్తుంది. అవసరమైనప్పుడు ఈ డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
ఈ గూగుల్‌ టేకౌట్‌ను ఉపయోగించి మొత్తం ఫొటోలను మీ పర్సనల్‌ స్టోరేజ్‌ డివైజ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అవసరం లేని, పాత ఫైల్స్‌ను వ్యక్తిగత స్టోరేజ్‌ డివైజ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి గూగుల్‌ టేకౌట్‌ డ్రైవ్‌ను ఖాళీ చేయవచ్చు. మీ Google అకౌంట్‌లో ఏ డేటా సేవ్ చేశారు. దేన్ని డౌన్‌లోడ్ చేయవచ్చో తెలుసుకోవడానికి గూగుల్‌ డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. 


గూగుల్‌ టేకౌట్‌ ఎలా పని  చేస్తుంది?


ముందుగా మీరు గూగుల్‌లోకి వెళ్లి గూగుల్‌ టేకౌట్‌ అని టైప్ చేస్తే లాగిన్ అడుగుతుంది. లాగిన్ అయిన తర్వాత మిమ్మల్ని గూగుల్‌ టేకౌట్ పేజ్‌కు తీసుకెళ్తుంది. ల్యాండింగ్ పేజీకి చేరుకున్న తర్వాత వివిధ గూగుల్‌ల యాప్‌ల నుంచి డౌన్‌లోడ్ చేయగల మొత్తం డేటా జాబితాను చూపిస్తుంది. 


మీరు డౌన్‌ చేయాల్సిన జాబితాను క్లిక్  చేయాల్సి ఉంటుంది. డిఫాల్ట్‌గా ప్రతి ఫైల్‌ సెలెక్ట్ చేసి ఉంటుంది. మీకు అవసరం లేనిదాన్ని తప్పించవచ్చు. మీరు ఉపయోగించాలనుకుంటున్న డేటాను మాత్రమే ఎంచుకోవచ్చు. 


ఫైల్స్‌ను ఎంపి చేసుకోండి


ఇక్కడ ఫైల్‌ను ఎంచుకోవాలి. వాటిని ఎలా డౌన్‌లోడ్‌ చేయదలుచుకున్నారో ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్‌లోడ్‌ ప్రక్రియలో మీ డేటా ఎలా డివైడ్‌ చేయాలో కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓ నిర్ధిష టైంకు మీ ఫైల్స్‌ అన్ని గూగుల్‌ టేకౌట్‌లో అప్‌లోడ్‌ అయ్యేలా చేసుకోవచ్చు. 


డేటా డౌన్‌లోడ్ చేయండి


మీ డౌన్‌లోడ్ ప్రాసెస్ చేయడానికి పట్టే సమయం డేటా సైజ్‌ బట్టి మారుతూ ఉంటుంది. పూర్తైన తర్వాత, మీరు ఆర్కైవ్ చేసిన ఫైల్‌ను నేరుగా మీ పర్శనల్‌ డివైజ్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ ఫైల్ సైజ్‌, తేదీ, అది ఎప్పటి వరకు ఉంటుందనే గడువును మీకు చూపుతుంది.


బ్యాకప్ పరిష్కారంగా గూగుల్‌ టేకౌట్‌?


గూగుల్ టేకౌట్‌ బ్యాకప్‌ పరిష్కారంగా పని చేస్తుందా అంటే లేదని చెప్పాలి. మీ డేటాను డౌన్‌లోడ్ చేయడానికి, ఎక్స్‌పోర్ట్ చేయడానికి అనుమతించినప్పటికీ సడెన్‌గా డేటా డిలీట్‌ అవ్వడం, లేదా ఇతర మార్గాల్లో డేటాకు నష్టం జరిగినప్పుడు గూగుల్ టేకౌట్ ఎలాంటి భద్రత ఇవ్వదు. రికవరీ కూడా సాధ్యం కాదు. దీనికి కొన్ని సమస్యలు ఉన్నాయి. 


బ్యాకప్ ఫ్రీక్వెన్సీపై పరిమితి - సంవత్సరానికి రెండు నెలలు మీ గూగుల్‌ డేటాను అటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేయడానికి మీరు గూగుల్‌ టేకౌట్‌ను షెడ్యూల్ చేయవచ్చు. రికవరీకి ఇదొకటే సరిపోదు. AvePoint క్లౌడ్ బ్యాకప్‌తో గూగుల్‌ వర్క్‌స్పేస్‌ని రోజుకు నాలుగు దపాలు డేటాను బ్యాకప్‌ చేయవచ్చు.


భద్రతా సమస్యలు - డేటా డౌన్‌లోడ్ చేసిన తర్వాత, ఆ డేటా భద్రత రిస్క్‌లో ఉంటుంది. ఇది ఒక సర్వర్ నుంచి మరొక సర్వర్‌కు కాపీ చేయవచ్చు. అసలు  ఆ డేటా ఓనర్‌తో సంబంధం లేకుండా క్లౌడ్‌లో షేర్‌ చేయవచ్చు. 


కంపాటిబిలిటీ సమస్య – గూగుల్‌ టేకౌట్‌తో డౌన్‌లోడ్ చేసిన ఫైల్‌లు ఇతర టూల్స్‌కు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఉదాహరణకు గూగుల్‌ షీట్‌లను మైక్రోసాఫ్ట్ వర్డ లేదా ఎక్సెల్‌లో ఓపెన్ చేయలేకపోవచ్చు. 


అడ్మిన్ నియంత్రణ లేకపోవడం - బ్యాకప్ పరిష్కారాన్ని కలిగి ఉండటానికి ప్రధాన కారణాలలో ఒకటి ఐటీ నిర్వాహకుల పనితనం. పరిష్కారం అవసరమైనప్పుడు సులభంగా డేటాను రికవరీ చేయడానికి అనుమతించగలగాలి. Google Takeoutతో, డేటాను యాక్సెస్ చేయడానికి, డౌన్‌లోడ్ చేయడానికి యూజర్‌ తరపున నిర్వాహకులు లాగిన్ అవ్వాలి. అయినప్పటికీ, అడ్మినిస్ట్రేటర్ Google Takeoutని కూడా ఆఫ్ చేయవచ్చు, తద్వారా వినియోగదారులు ఏ డేటాను ఎక్స్‌పోర్ట్‌, డౌన్‌లోడ్‌ చేయలేరు.


ఈ సమస్యలను పరిష్కరిస్తూ డేటా సెక్యూరిటీకి ఎలాంటి ఇబ్బంది రాకుండా థర్డ్ పార్టీ అప్లికేషన్స్‌ను ఉపయోగించి రికవరీ చేయవచ్చు. ఆ డేటా వివిధ ఫార్మాట్స్‌లో ఉంటుంది. ఎక్కువ జిప్‌ ఫార్మాట్‌లోకి వస్తుంది. దీన్ని మళ్లీ యథాస్థితికి తీసుకురావడం చాలా కష్టంతో కూడుకున్న పనిగా టెక్‌ నిపుణులు చెబుతున్నారు. 
ఇప్పుడు వివేక కేసులో కూడా ఎన్నో రోజులు శ్రమించి నిందితులుగా భావిస్తున్న వారి లొకేషన్లు, ఇతర ఆధారాలను దర్యాప్తు అధికారులు సేకరించినట్టు తెలుస్తోంది.