మేష రాశి


ఈ రాశివారు ఈ రోజు మీకు ప్రత్యేకమైన వ్యక్తితో కలిసి పార్టీకి  వెళ్లే అవకాశం ఉంది. వివాహితులు కుటుంబానికి సమయం కేటాయించండి. ఇంట్లో ఉన్న సరదావాతావరణం కొనసాగేలా ప్లాన్ చేసుకోండి


వృషభ రాశి


ఈ రాశివారి వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. భవిష్యత్ కి సంబంధించి జీవిత భాగస్వామితో చర్చలు జరుపుతారు. ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులకు మంచి రోజు. పెళ్లిదిశగా అడుగేసేందుకు ఇదే మంచి సమయం. 


మిథున రాశి


ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో వాదనకు దిగుతారు..కానీ..అది పెరగకుండా ఉండేందుకు ప్రయత్నించండి. లేదంటే మీ బంధం క్షీణించవచ్చు. ఈ రోజు మీ వ్యక్తిగత జీవితానికి కొంత సమయం కేటాయించండి. కొన్ని విషయాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. 


కర్కాటక రాశి 


ప్రేమికులకు ఈ రోజు మంచిరోజు...కానీ ఏ విషయంలోనూ తొందరపడొద్దు. పెళ్లిదిశగా అడుగేయాలని అనుకోవడం మంచిదే కానీ ఇంట్లో పరిస్థితులు చూసుకుని మాట్లాడండి. వైవాహిక జీవితంలో కొంత నిరుత్సాహం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఏదో విషయంలో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది.


Also Read:నిత్యం తినే ఆహారంలో 5 రకాలైన దోషాలు, మీరు ఎలాంటి భోజనం చేస్తున్నారో తెలుసా! 


సింహ రాశి


మీ భాగస్వామి పట్ల మీ ప్రేమను, శ్రద్ధను బయటకు వ్యక్తం చేయండి. అలాంటప్పుడు మాత్రమే వారు మీకు ఎంత ప్రత్యేకమో అర్థమవుతుంది. వారిని ఆశ్చర్యపరిచేందుకు ఏదైనాబహుమతి ఇవ్వండి.వారి భావాలను గౌరవించండి. ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి. 


కన్యా రాశి


వైవాహిక జీవితం మెరుగ్గా ఉంటుంది. మీ బంధంలో ప్రేమ ఎక్కువవుతుంది. ప్రేమికులకు మాత్రం అంత శుభదినం కాదు. ఎందుకంటే చిన్న విషయానికే ప్రియమైనవారితో విభేదాలు ఉండొచ్చు. 


తులా రాశి 


ఈ రాశివారు మీ మనసులో మాటను చెప్పేందుకు మంచిరోజు. ఇప్పటికే రిలేషన్ షిప్ లో ఉంటే ఆ బంధాన్ని మరింత బలపరుచుకోండి. కుటుంబ జీవితం గడుపుతున్న వారు సమయాన్ని కేటాయించడం ద్వారా సంతోషంగా ఉంటారు.


వృశ్చిక రాశి 


ఈ రాశివారి వైవాహిక జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు  కూడా ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. ప్రియమైన వ్యక్తి మీ గురించి ఏదో గురించి చెడుగా ఆలోచించవచ్చు..


Also Read: ఈ 5 కలలు పొరపాటున కూడా ఇతరులతో పంచుకోకూడదు


ధనుస్సు రాశి 


ఈ రాశి వారు ఈ రోజు ప్రేమను అందిస్తారు..పొందుతారు. మీ జీవితంలోకి కొత్తగా వచ్చిన వ్యక్తిని సంతోషంగా ఆహ్వానించండి.  రానున్న రోజుల్లో వారికారణంగా మీరు ఆనందంగా ఉంటారు. స్నేహితుల మధ్య కూడా చీలిక వచ్చినా మళ్లీ మంచి స్నేహం బలపడుతుంది. వైవాహిక జీవితం బావుంటుంది. 


మకర రాశి 


ప్రేమికులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది కానీ గొడవలకు దూరంగా ఉండండి. మీ ప్రియమైన వారి భావాలను జాగ్రత్తగా గమనించండి..పరిగణలోకి తీసుకోండి. వివాహితులు కూడా సంతోషంగా ఉంటారు. 


కుంభ రాశి


ఈ రాశి అవివాహితులు పెళ్లిచేసుకునేందుకు ఇదే మంచిసమయం. ఈ రోజు మీరు మీ తల్లిదండ్రులకు బహిరంగంగా మీ మనసులో మాట చెప్పండి...వారి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితం బావుంటుంది. భాగస్వామితో మంచి అనుబంధం ఉంటుంది. 


మీన రాశి


ఈ రాశివారి ప్రేమ జీవితంలో టెన్షన్ ఉంటుంది. వైవాహిక జీవితం గడుపుతున్న వారికి ఈ రోజు చాలా బాగుంటుంది. వీరి బంధంలో ప్రేమ పెరుగుతుంది