Weather Latest News: నిన్న దక్షిణ అంతర్గత కర్నాటక నుండి దక్షిణ ఛత్తీస్గఢ్ వద్ద ఉన్న తూర్పు గాలులలోని ద్రోణి ఈరోజు బలహీనపడింది. నిన్నటి దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు పరిసర ప్రాంతాలలో వున్న ఉపరితల ఆవర్తనం ఈరోజు మరఠ్వాడా, దాని పరిసర విధర్భ, తెలంగాణ వద్ద సముద్ర మట్టానికి సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు కింది స్థాయిలోని గాలులు నైరుతి, దక్షిణ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని కారణంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 31.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.3 డిగ్రీలుగా నమోదైంది. 76 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
Andhra Pradesh Weather: ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, ఆగ్నేయ దిశల్లో గాలులు వీయనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు పొగమంచు ఉంటుందని చెప్పారు. ఉత్తర కోస్తాంధ్రలో కూడా వర్ష సూచన ఉందని తెలిపారు. రాయలసీమలో కూడా అక్కడక్కడ జల్లులు పడతాయని వెల్లడించారు. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో కూడా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.