Weather Latest News: సెప్టెంబరు 5న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిన్న ఆంధ్రప్రదేశ్ తీరం, పశ్చిమ - మధ్య పరిసర బంగాళాఖాతం వద్ద కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావం వల్ల ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరం వద్ద, పశ్చిమ - మధ్య మరియు పరిసర వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఒకటి ఏర్పడింది. దీని అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి వున్నది.  


ఋతుపవన ద్రోని ఈరోజు సగటు సముద్ర మట్టానికి సూరత్ఘార్, రోహతక్, ఒరయ్, మాండ్ల  గుండా ఉత్తర ఆంధ్రప్రదేశ్- దక్షిణ ఒడిశా తీరం వద్ద, పశ్చిమ - మధ్య, పరిసర వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రాంతం కేంద్రం నుంచి, తూర్పు-మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నది.


రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.


వాతావరణ హెచ్చరికలు (weather warnings):
ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు మరియు ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలలో ఉరుములు మరియు  ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే అవకాశం వుంది.


నేడు భారీ వర్షాలు తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.


Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 8 - 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 28.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.7 డిగ్రీలుగా నమోదైంది. 95 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.


ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ఆంధ్రప్రదేశ్‌కు వాయుగండం ముప్పు తప్పినట్టే కనిపిస్తోంది. అయితే మరో అల్పపీడనం వచ్చే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరదిశగా కదులుతుండటంతో ఏపీపై ప్రభావం తక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అభిప్రాయపడింది. వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం రెండు రోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్‌ తీరాలపై ప్రభావం చూపనుంది. దీని ఎఫెక్ట్‌తో రాజస్థాన్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌ మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉందని ఐఎండీ పేర్కొంది. 


ఈ అల్పపీడన ప్రభావంతో కోస్తా ప్రాంతంలో మాత్రం భారీ వర్షాలు ఉంటాయని. రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి వానలు పడతాయని చెబుతున్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్‌ ఉందని తెలిపారు. 
Also Read: వరద మిగిల్చిన 'కన్నీటి' గాథలు - నలుగురిని కాపాడి మృత్యుఒడికి, వరద బాధితులను వెంటాడిన విషాదాలెన్నో!


దక్షిణ కోస్తాలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.


Also Read: వరద బాధితులకు అండగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ - రూ. కోటి విలువైన ఆహారం పంపిణీ


అల్పపీడన ప్రభావంతో మూడు రోజులపాటు సముద్రం పోటెత్తుతుందని గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంటున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.