హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములు మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 37డిగ్రీలు, 24 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉంది. నైరుతి దిశ నుంచి గాలులు వీయనున్నాయి. నిన్న నమోదైన గరిష్ణ ఉష్ణోగ్రత-36.2 డిగ్రీలు కనిష్ణ ఉష్ణోగ్రత-25 డిగ్రీలు






తెలంగాణలో మిగతా జిల్లాల పరిస్థితి చూస్తే...  ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మిగతా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా ఉండబోతోంది. ఉష్ణోగ్రతలు సుమారు 40 డిగ్రీల మేరకు ఏర్పడనున్నాయి. ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాల్లో 45 డిగ్రీల వరకు గరిష్ణ ఉష్ణోగ్రతలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. ఈ ఎండలకు తోడు అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. 






ఈ వారం రోజులే కాదు ఏప్రిల్ మొత్తం ఎండలతో మోత మోగిపోనుంది. భానుడు భగభగ మండిపోనున్నాడని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఒకట్రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ ఇచ్చారు. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. వాతావరణశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం అత్యధిక ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో 39.8 డిగ్రీలు, తక్కువ ఉష్ణోగ్రత మెదక్‌లో 20.3 డిగ్రీలుగా నమోదు అయింది. 


ఏపీలో వెదర్‌ ఇలా
ఏపీలో ఎక్కడా వర్షాలు పడే అవకాశం లేదని అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు లాంటి వాతావరణంతో పాటు బలమైన గాలులు దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకూ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాలోని అన్ని జిల్లాల్లో ఈ రకమైన వాతావరణం ఉంటుందని తెలిపారు. వచ్చే 4 రోజుల పాటు ఇదే రకం వాతావరణ పరిస్థితి ఉంటుందని తెలిపారు.


దేశవ్యాప్తంగా వాతావరణం


ఢిల్లీలోని కొన్ని ప్రదేశాలలో (ముండకా, పశ్చిమ్ విహార్, రాజౌరీ గార్డెన్, జాఫర్‌పూర్, నజఫ్‌గఢ్, ద్వారక, పాలం, ఐజిఐ విమానాశ్రయం) పరిసర ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉంది. ఎన్సీఆర్‌(బహదూర్‌ఘర్) జింద్, అడంపూర్, హిస్సార్, గోహనా, హంసీ, మెహమ్, తోషమ్, రోహ్‌తక్, భివానీ, చర్ఖీ దాద్రి, మట్టన్‌హైల్, ఝజ్జర్, ఫరూఖ్‌నగర్, కోసలి, మహేందర్‌ఘర్, రేవారీ, నార్నాల్, బవల్ (హర్యానా, రాజ్‌గర్‌ఘర్‌ఘర్) భివారీ, (రాజస్థాన్) లో కూడా మోస్తరు వర్షాలు పడొచ్చు. 


సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం, ఢిల్లీలో గురువారం ఉదయం 9 గంటలకు మొత్తం గాలి నాణ్యత సూచిక (AQI) 73 నమోదైంది, ఇది 'సంతృప్తికర' విభాగంలోకి వస్తుంది. 0 - 50 మధ్య ఉన్న AQI 'మంచిది', 51 - 100 'సంతృప్తికరమైనది', 101 - 200 'మితమైన', 201 - 300 'పూర్', 301 - 400 'చాలా దారుణం', 401 - 500 మధ్య 'తీవ్రమైనది'గా పరిగణించబడుతుంది.