కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో 4,500 ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్-2022 (టైర్-1) ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్చి 31న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. టైర్-1 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్డ్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి ఆన్సర్ కీ చూసుకోవచ్చు.


ఆన్సర్ కీతోపాటు అభ్యర్థులు రెస్పాన్స్ షీట్లను కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందబాటులో ఉంచింది.  ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.100 ఫీజు చెల్లించి మార్చి 31 నుంచి ఏప్రిల్ 3లోగా ఆన్‌లైన్‌ ద్వారా తెలియజేయవచ్చు. ఎస్‌ఎస్‌సీ మార్చి 9 నుంచి 21 వరకు దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ టైర్-1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 


ఆన్సర్ కీ, అభ్యంతరాల నమోదు కోసం క్లిక్ చేయండి..




సీహెచ్‌ఎస్‌ఎల్ పోస్టుల వివరాలు..
కేంద్రప్రభుత్వ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించే 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్-2022' నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) డిసెంబరు 6న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా పలు విభాగాల్లోని లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీచేయనున్నారు. డిసెంబరు 6 నుంచి జనవరి 4 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.  రెండు దశల పరీక్షల (టైర్-1, టైర్-2) ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు. తాజాగా టైర్-1 పరీక్షల నిర్వహణ తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకించింది. 


సీహెచ్‌ఎస్‌ఎల్-2022 నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


టైర్-1 పరీక్ష (ఆబ్జెక్టివ్) పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు టైర్-1 ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం నాలుగు విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్) నుంచి 15 ప్రశ్నలు - 50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు ఉంటాయి. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు.


టైర్-2 పరీక్ష విధానం..


స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ పరీక్ష విధానం..


✦  టైర్-2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు టైర్-3లో స్కిల్‌టెస్ట్/ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత ప‌రీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు.


✦ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు.. డేటా ఎంట్రీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాల వ్యవధి 15 నిమిషాలు. డేటా ఎంట్రీ పోస్టుల‌కు గంట‌కు 8000 కీ డిప్రెష‌న్స్ కంప్యూట‌ర్‌పై ఇవ్వాలి. ఇందుకోసం సుమారు 2000-2200 కీ డిప్రెష‌న్స్ ఉన్న ఇంగ్లిష్ వ్యాసాన్ని ఇచ్చి 15 నిమిషాల వ్యవ‌ధిలో కంప్యూట‌ర్‌లో టైప్ చేయ‌మంటారు.


✦ లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం 10 నిమిషాలు. టైపింగ్ టెస్ట్‌లో ఇంగ్లిష్ ఎంచుకున్నవారు నిమిషానికి 35 ప‌దాలు, హిందీని ఎంచుకున్నవారు నిమిషానికి 30 ప‌దాలు టైప్ చేయాలి.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...