ఏప్రిల్ 1 రాశిఫలాలు, అన్ని విషయాల్లో ఈ రాశివారి డామినేషన్ పెరుగుతుంది

Rasi Phalalu Today 1st April 2023: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

Continues below advertisement

మేష రాశి

మేధోపరమైన కృషితో పనిని ఈ రాశివారు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ భాగస్వామికి కొన్ని సమస్యలు ఉండవచ్చు..కూర్చుని మాట్లాడటం మంచిది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కెరీర్లో మరింత కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు.

Continues below advertisement

వృషభ రాశి

ఈ రోజు మీకు ఒడిదొడుకులతో నిండిన రోజు అవుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు..కానీ ఆలస్యం అవడం వల్ల కొన్నిసార్లు బాధపడక తప్పదు. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి.

మిథున రాశి 

ఈ రాశివారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా విషయం మర్చిపోయే అవకాశం ఉంది. కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది..లేదంటే ఇంటివాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. 

కర్కాటక రాశి

ఈ రోజు అన్ని రంగాల్లో ఈ రాశివారి ఆధిపత్యం పెరుగుతుంది. రోజు అంత అనుకూలంగా లేదు  కాబట్టి పెట్టుబడి పెట్టేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. కోపం, ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ నిరాశాజనక ఫలితాలను ఇస్తాయి.

సింహ రాశి

ఈ రోజు సింహరాశివారికి ఒడిదొడుకులతో నిండిన రోజు అవుతుంది. మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది.  ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. అనుకున్న పనులు సమయానికి పూర్తికావు..మీపై  ఒత్తిడి పెరుగుతుంది. 

కన్యా రాశి 

ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనతో ఉంటారు కానీ పరిస్థితి అనుకూలంగా ఉండదు. మీరు మీ సాధారణ జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటారు. అవసరమైతే రాజీకి సిద్ధపడతారు. 

Also Read: 2023 ఏప్రిల్ నెల రాశిఫలాలు - ఈ 6 రాశులవారు ఆర్థికంగా ఓ మెట్టెక్కుతారు, అన్నీ అనుకూల ఫలితాలే!

తులా రాశి

చాలా కాలంగా కొనసాగుతున్న ఒక పెద్ద సందిగ్ధత నుంచి మీరు త్వరలోనే బయటపడతారు. కొద్దిపాటి శ్రమతో పనులు పూర్తిచేస్తారు. సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది. సామాజిక సేవ చేయడానికి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం బావుంటుంది. మానసిక ఆనందం పెరుగుతుంది. 

వృశ్చిక రాశి 

ఈ రోజు మీకు మిశ్రమ రోజు. అనవసరమైన విషయాలను మీపై ఆధిపత్యం చెలాయించకుండా ఆపివేస్తే  మీరు ఈ రోజును మంచిగా మార్చగలుగుతారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కానీ వాటికి భయపడకూడదు. ఆదాయం కూడా బాగుంటుంది.

ధనుస్సు రాశి

ఈ రోజు సంతోషకరమైన రోజు. ఈ రోజు మీ ఆలోచనలు మరియు ప్రణాళికలు స్పష్టంగా ఉంటాయి. మీ ఊహాశక్తి విస్తరిస్తుంది. ఈ రోజు మీరు భిన్నమైన అనుభూతిని పొందుతారు.ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారులకు అభ్యర్థనలు చేయాలంటే ఈరోజు శుభదినం

మకర రాశి

పెండింగ్ పనులను నిర్విరామంగా పూర్తిచేస్తారు. మీ వ్యక్తిగత జీవితం ఆనందంగా ఉంటుంది. ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం మీ మానసిక, శారీరక ఆరోగ్యానికి మంచిది కాదు ఈ రోజు మీరు ప్రశాంతంగా ఉండటం మంచిది.

Also Read: ఈ ఏడాది ఏలినాటి శని, అష్టమ శని ప్రభావం ఉన్న రాశులివే!

కుంభ రాశి

ఈ రోజు మీకు మంచి రోజు. మీ సమర్థత, తెలివితేటలతో పనిలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. మీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది, ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది.

మీన రాశి

ఈ రోజంతా సంతోషంగా ఉంటారు.  ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగఅవకాశం పొందుతారు. వ్యాపారులు ఇప్పుడు పెట్టే పెట్టుబడుల వల్ల రాబోయే రోజుల్లో ప్రయోజనాలను పొందుతారు. ఆరోగ్యం జాగ్రత్త...

Continues below advertisement