త్రBharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర.. కర్ణాటకలో కొనసాగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గురువారం ఈ యాత్రలో పాల్గొన్నారు. కుమారుడు రాహుల్ గాంధీతో కలిసి ఆమె పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఆ సమయంలో జనం ఎక్కువగా ఉండటంతో ఓ చిన్న పాప కింద పడిపోయింది. ఇది గమనించిన సోనియా, రాహుల్ గాంధీ వెంటనే స్పందించి ఆ పాపను పైకి లేపి దగ్గరకు తీసుకున్నారు.






ఇదీ జరిగింది


మండ్య జిల్లాలో కవాతులో భారీ రద్దీ కారణంగా ఓ బాలిక కింద పడిపోయింది. ఇది గమనించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వెంటనే ఆగిపోయారు. ఆ బాలికను పైకి లేపిన సోనియా గాంధీ.. "ఏమైనా దెబ్బ తగిలిందా అంటూ" ఆ పాపను నిమిరారు.


త్రివర్ణ పతాకం పట్టుకున్న ఆ పాపను రాహుల్ గాంధీ దగ్గరకు తీసుకున్నారు. "ఏం పర్లేదు కదా" అని అడిగారు. ఈ వీడియోను కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


షూ లేస్


రాహుల్‌తో కలిసి సోనియా గాంధీ కూడా జోడో యాత్రలో పాలు పంచుకున్నారు.  ఆ సమయంలో ఆమె వేసుకున్న షూ లేస్ ఊడిపోయింది. దీంతో పక్కనే ఉన్న రాహుల్.. అమ్మ సోనియా గాంధీ షూ లేస్ కట్టారు.  సోనియా నవ్వులు చిందిస్తూ తన కుమారుడిని చూశారు. తల్లీ కొడుకుల అనుబంధానికి నిదర్శనంగా నిలిచిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "కాంగ్రెస్ పార్టీకి యువరాజైనా.. సోనియాకు మాత్రం రాహుల్ కొడుకే" అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.






భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ.. పలువురు కార్యకర్తలు, ప్రజలతో మమేకమవుతున్నారు. ఇటీవల గాంధీ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.


సత్యం, అహింస మార్గంలో నడవడాన్ని మనకు బాపూజీ నేర్పించారు. ప్రేమ, కరుణ, సద్భావం, మానవత్వం అర్థాలను వివరించారు. గాంధీ జయంతి సందర్భంగా ఓ ప్రతిజ్ఞ చేస్తున్నాం. బాపూజీ ఏ విధంగా అయితే అన్యాయానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చారో, అదే విధంగా ఇప్పుడు మేం భారత దేశాన్ని ఏకం చేస్తాం.                                                              "


-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

Also Read: Nobel Prize 2022 Literature: సాహిత్య రంగంలో ఫ్రెంచ్ రచయిత్రిని వరించిన నోబెల్ బహుమతి


Also Read: Mulayam Singh Yadav Health: లైఫ్ సపోర్ట్‌పై ములాయం సింగ్ యాదవ్- తాజా హెల్త్ బులిటెన్ విడుదల!