Wayanad By-Election:


సమయం ఉంది..


రాహుల్‌పై అనర్హతా వేటు వేసిన తరవాత వాయనాడ్‌ ఎంపీ స్థానం ఖాళీ అయింది. అయితే..కర్ణాటక ఎన్నికల తేదీలు ప్రకటించే సమయంలోనే ఇక్కడా ఉప ఎన్నికలు ప్రకటిస్తారని భావించారంతా. కానీ...సీఈసీ రాజీవ్ కుమార్ ఇలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. దీనిపై మీడియా ప్రశ్నించగా...కీలక వ్యాఖ్యలు చేశారు సీఈసీ రాజీవ్ కుమార్. "అంత తొందరేముంది. ఇంకా టైమ్ ఉందిగా" అని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు...ట్రయల్ కోర్టు 30 రోజుల సమయం ఇచ్చిందని గుర్తు చేశారు. దీనిపై తుది తీర్పు వచ్చేంత వరకూ ఎన్నికల సంఘం వేచి చూస్తుందని అన్నారు. 


"ఓ సీట్‌ ఖాళీ అయ్యాక దాదాపు భర్తీ చేసేందుకు, ఉప ఎన్నికలు నిర్వహించేందుకు దాదాపు ఆర్నెల్ల సమయం ఉంటుంది. ట్రయల్ కోర్టు కూడా రాహుల్‌కు 30 రోజుల సమయమిచ్చింది. అందుకే కొద్ది రోజులు వేచి చూస్తాం"


- సీఈసీ రాజీవ్ కుమార్ 






ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం...మార్చి 23వ తేదీన వాయనాడ్ ఎంపీ స్థానం ఖాళీ అయినట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సూరత్ కోర్టు దోషిగా తేల్చుతూ రెండేళ్ల జైలుశిక్ష విధించడంతో ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తాజాగా కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ లోని అధికారిక నివాసాన్ని రాహుల్ గాంధీ ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 22వ తేదీలోగా రాహుల్ గాంధీ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని సభ హౌసింగ్ కమిటీ స్పష్టం చేసింది. ఏప్రిల్ 23 నుంచి అధికారిక నివాసం రద్దు అవుతుందని నోటీసులలో పేర్కొన్నారు. ఎంపీగా అనర్హత వేటు పడటంతో నేతలు వారికి కేటాయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. మార్చి 23న రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై వేటు పడింది. దాంతో నెల రోజుల వ్యవధిలో సభ్యుడు/సభ్యురాలు తమకు కేటాయించిన నివాసాన్ని నెల రోజుల వ్యవధిలో ఖాళీ చేయాలి. ఈ మేరకు రాహుల్ గాంధీకి కేటాయించిన ఎంపీ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్ సభ హౌసింగ్ కమిటీ తాజాగా సోమవారం నాడు నోటీసులు జారీ చేసింది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్త చేశారు. రాహుల్ గాంధీ కోరుకుంటే తన ఇంటికి రావాలని, ఆయన కోసం తన బంగ్లాను ఖాళీ చేస్తానని ప్రకటించారు. రాహుల్ గాంధీ బంగ్లాను ఖాళీ చేస్తే ఆయన తన తల్లితో కలిసి ఉంటారని, లేదంటే తనతో కలిసి ఉండొచ్చని, ఆయన కోసం బంగ్లాను ఖాళీ చేస్తానని చెప్పారు ఖర్గే. రాహుల్‌ను బెదిరించడం, అవమానించడం వంటి వైఖరిని ఖండిస్తున్నామన్నారు ఖర్గే. ఈ పద్ధతి మంచిది కాదన్నారు. "కొన్నిసార్లు మేము 3-4 నెలలు బంగ్లా లేకుండా ఉంటున్నాం. 6 నెలల తర్వాత నాకు బంగ్లా దొరికింది. వీళ్లు తమ వారిని కించపరిచేందుకే ఇలా చేస్తున్నారు. అటువంటి వైఖరిని నేను ఖండిస్తున్నాను. 


Also Read: Aam Aadmi Party Status: ఆప్‌ను జాతీయ పార్టీగా గుర్తిస్తున్నారా? ఆసక్తికర సమాధానమిచ్చిన సీఈసీ రాజీవ్ కుమార్