Rahul Gandhi’s Bike Ride:


మధ్యప్రదేశ్‌లో యాత్ర..


కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో ఉత్సాహంగా కొనసాగుతోంది. మోవ్ ప్రాంతంలో పర్యటించిన రాహుల్ గాంధీ...బైక్ రైడ్ చేసి సందడి చేశారు. మల్వా నిమర్ ప్రాంతంలో జనసందోహం మధ్య బైక్‌ నడుపుతూ అందరినీ ఉత్సాహ పరిచారు. అయితే...అంతకు ముందు ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాహుల్ ర్యాలీ ప్రారంభమయ్యే ఓ పావు గంట ముందు మోవ్ టౌన్‌లో పవర్ కట్ చేశారు. సిటీ అంతా పావుగంటలోనే రెండు సార్లు పవర్ కట్ చేశారని స్థానికులు తెలిపారు. రాహుల్ గాంధీ వచ్చే సమయానికి కరెంట్ వచ్చినప్పటికీ...ఆ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇది చేశారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. పవర్ కట్‌ అనేది సహజం కాదని, రాష్ట్ర ప్రభుత్వం కుట్ర అని మండి పడ్డారు. అయితే...విద్యుత్ అధికారులు మాత్రం టెక్నికల్ ప్రాబ్లమ్ వల్లే జరిగిందని వివరణ ఇచ్చారు. రాహుల్‌తో పాటు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాగేల్ కూడా యాత్రలో పాల్గొన్నారు. 






స్మృతి ఇరానీ వర్సెస్ కాంగ్రెస్..


ఇటీవల రాహుల్ గాంధీ ఆయన ఓంకారేశ్వర్ వద్ద నర్మదా నదీ తీరాన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హారతి ఇస్తున్న ఫోటోని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. "ఓంకారేశ్వర ఆలయాన్ని దర్శించడం ఎంతో ఆనందం కలిగించింది. ఆ తరవాత నర్మదా హారతి కార్యక్రమంలోనూ పాల్గొన్నాను" అని ట్వీట్ చేశారు. ఈ హారతి ఇచ్చే సమయంలో ఆయన ఓ శాలువాను కప్పుకున్నారు. దానిపై ఓంకార ముద్రలు ఉన్నాయి. ఈ ఫోటోని రీట్వీట్ చేస్తూ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రాహుల్‌పై సెటైర్ వేశారు. నిజానికి రాహుల్ కప్పుకున్న శాలువాపై ఓంకార ముద్రలు రివర్స్‌లో ఉన్నాయి. ఆ ఫోటోని రొటేట్ చేస్తూ స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. "ఇప్పుడు సరిగా ఉంది" అని ట్విటర్‌లో ఆ ఫోటోని షేర్ చేశారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది. హిందూ ఆచారాలను అవమానిస్తున్నారంటూ ప్రియాంక చతుర్వేది స్మృతి ఇరానీపై విమర్శలు చేశారు. "అస్సాం సీఎం రాహుల్‌ గాంధీని ట్రోల్ చేసి "కిరీటం" సాధించుకున్నారు. ఇప్పుడు హిందూ ఆచారాలను ట్రోల్ చేస్తూ స్మృతి ఇరానీ ఆ కిరీటాన్ని ఆయన దగ్గర నుంచి లాగేసుకున్నారు" అని కౌంటర్ వేశారు ప్రియాంక చతుర్వేది. ఇటీవలే అసోం సీఎం హిమంత శర్మ రాహుల్‌ని సద్దాం హుసేన్‌తో పోల్చారు. దీన్ని ఉద్దేశిస్తూ ప్రియాంక ఇలా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రతినిధి లావణ్య బలాల్ కూడా దీనిపై స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. "రాహుల్ గాంధీపై మీకున్న విద్వేషం తారస్థాయికి చేరుకుంది"  అని మండి పడ్డారు. 


Also Read: Suvendu Adhikari on CAA: ధైర్యం ఉంటే CAAని అడ్డుకోండి, మమతా బెనర్జీకి సువేందు అధికారి సవాల్