ABP  WhatsApp

Wall Collapses In Noida: నాలుగు రోజుల్లో రెండో ఘటన- గోడ కూలి నలుగురు మృతి

ABP Desam Updated at: 20 Sep 2022 01:13 PM (IST)
Edited By: Murali Krishna

Wall Collapses In Noida: ఉత్తర్‌ప్రదేశ్‌లో సరిహద్దు గోడ కూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు.

(Image Source: PTI)

NEXT PREV

Wall Collapses In Noida: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నోయిడాలో ఓ సరిహద్దు గోడ కూలి పోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.


ఇదీ జరిగింది


నోయిడాలోని జల్ వాయు విహార్ సెక్టార్ 21 వద్ద మంగళవారం ఉదయం ప్రహారీ గోడ కూలింది. గోడ కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి నోయిడా పోలీస్ కమిషనర్ అలోక్ సింగ్ వివరించారు.



గోడ కూలిన ఘటనలో దురదృష్టవశాత్తు నలుగురు మరణించారు. 9 మందిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాం. ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక విభాగం శిథిలాలను తొలగిస్తోంది. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.                                                                      - అలోక్ సింగ్, నోయిడా పోలీస్ కమిషనర్


చర్యలు చేపడతాం


గోడ కూలిన ఘటన గురించి నోయిడా జిల్లా మెజిస్ట్రేట్ సుహాస్ స్పందించారు.





నోయిడా అథారిటీ.. జల్ వాయు విహార్ సమీపంలో డ్రైనేజీ మరమ్మతు పనుల కోసం సెక్షన్ 21లో కాంట్రాక్ట్ ఇచ్చింది. కార్మికులు ఇటుకలను బయటకు తీస్తున్నప్పుడు గోడ కూలిపోయిందని మాకు తెలిసింది. ఈ ఘటనలో గాయపడి చికిత్స పొందుతోన్న వారిలో జిల్లా హాస్పిటల్ & కైలాష్ హాస్పిటల్‌లో మొత్తం నలుగురు మృతి చెందారు.                                                   -   సుహాస్, నోయిడా జిల్లా మెజిస్ట్రేట్


ఇటీవల


ఉత్తర్‌ప్రదేశ్‌ లఖ్‌నవూలో సెప్టెంబర్ 16న ఇదే తరహా ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా లఖ్‌నవూలోని దిల్‌కుషా ప్రాంతంలో ఆర్మీ ఎన్‌క్లేవ్ సరిహద్దు గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 9 మంది వరకు మృతి చెందారు. 


గోడ కూలిన ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.  


Also Read: Congress President Poll: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో థరూర్ VS గహ్లోత్- మరి రాహుల్ సంగతేంటి!


Also Read: Uttar Pradesh News: బాత్రూమ్‌లో భోజనాలు- కబడ్డీ ప్లేయర్లకు ఘోర అవమానం!


 

 
Published at: 20 Sep 2022 01:09 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.