Apollo Pharmacy: హైదరాబాబాదీ హాస్పిటల్‌ అపోలో హాస్పిటల్స్‌ (Apollo Hospitals Enterprise Limited) గ్రూప్‌లోని అపోలో ఫార్మసీ ‍‌(Apollo Pharmacy) 5,000 ఫార్మసీ స్టోర్ల మైలురాయిని చేరుకుంది. 


చెన్నైలోని OMR రోడ్‌లో ఉన్న పెరుంగుడి వద్ద 5000వ స్టోర్‌ను ఈ సంస్థ ప్రారంభించింది. ఇది ఆడియాలజీ, ఆప్టోమెట్రీ వంటి సేవలను అందిస్తుంది.


ఈ ఫార్మసీలో కియోస్క్ ఉంది. ఇక్కడ వినియోగదారులు అక్కడికక్కడై వైటల్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. డాక్టర్‌తో ప్రైవేట్ వీడియో కన్సల్టేషన్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇంటికి వచ్చి ల్యాబ్ టెస్ట్‌లు చేసేలా ఆర్డర్ కూడా ఇవ్వవచ్చు.


10 వేల స్టోర్లు -10 లక్షల వినియోగదారులు
దేశంలో 60 కోట్ల మందికి మెడికల్‌ షాపులు అందుబాటులో ఉన్నాయని ఈ కంపెనీ తెలిపింది. తమ స్టోర్ల ద్వారా ప్రతిరోజూ సుమారు ఏడు లక్షల మంది వినియోగదారులకు సేవలందిస్తున్నామని, భవిష్యత్తులో ఆ సంఖ్యను 10 లక్షలకు చేర్చాలనుకుంటున్నట్లు అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ శోభన కామినేని వెల్లడించారు.


దేశవ్యాప్తంగా 10,000 ఫార్మసీ స్టోర్లను ఓపెన్‌ చేయాలన్నది అపోలో ఫార్మసీ లక్ష్యమని, త్వరలోనే దీన్ని సాధిస్తామని అపోలో ఫార్మసీ CEO జయకుమార్‌ తెలిపారు. 


13,000కు పైగా పిన్‌కోడ్స్‌
1987లో అపోలో ఫార్మసీ ప్రారంభమైంది. దేశంలో మొట్టమొదటి, అతి పెద్ద ఓమ్ని ఛానెల్ బ్రాండెడ్ ఫార్మసీ రిటైల్ నెట్‌వర్క్ ఇది. అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌లోని 'అపోలో హెల్త్‌కో' విభాగంగా పని చేస్తోంది. 13,000 పైగా పిన్ కోడ్స్‌లో ఈ 5000 ఫార్మసీ స్టోర్‌లు సేవలు అందిస్తున్నాయి. 


అపోలో హాస్పిటల్స్‌ జోష్‌
5,000వ స్టోర్‌ ఓపెనింగ్‌తో, ఇవాళ్టి (మంగళవారం) ట్రేడింగ్‌లో, అపోలో హాస్పిటల్స్‌ షేరు జోరుగా సాగుతోంది. ఉదయం 10.15 గంటల సమయానికి 38.45 రూపాయలు లేదా 0.89 శాతం లాభంతో, రూ.4,346.65 ప్రైస్‌ దగ్గర షేర్లు ట్రేడ్‌ అవుతున్నాయి. 


గత నెల రోజుల్లో 8 శాతం పెరిగిన ఈ స్టాక్‌, గత ఆరు నెలల సమయంలో మాత్రం దాదాపు 9 శాతం నష్టంలో ఉంది. గత ఏడాది కాలంలో దాదాపు 11 శాతం దిగువన ఉంది. ఈ స్టాక్‌ 52 వారాల గరిష్టం రూ.5,935.40 కాగా, 52 వారాల కనిష్టం రూ.3,361.55. 


Also read: ₹740 కోట్ల ఐనాక్స్‌ గ్రీన్‌ ఐపీవోకి సెబీ గ్రీన్‌ సిగ్నల్‌


Also read: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - స్పాట్‌ లైట్‌లో Welspun, KIMS


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.