Viral Video: రైల్వే క్రాసింగ్ దాటుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా నిశితంగా గమనిస్తూ ఉండాలి. అలా కాకుండా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు.


ఇటీవల రైల్వే క్రాసింగ్‌ను వాహనంతో లేక నడుస్తూ హడావుడిగా దాటుతున్న ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ యువతి హెడ్‌ఫోన్స్ పెట్టుకుని రైల్వే క్రాసింగ్ దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






వైరల్ వీడియో


ఈ వీడియోలో ఒక విదేశీ మహిళ రైల్వే క్రాసింగ్ దాటుతోంది. అయితే చుట్టూ చూడకుండా హెడ్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ బిజీగా రైల్వే క్రాసింగ్ దాటుతోంది. ఆ సమయంలో రైల్వే ట్రాక్‌పై ఓ ట్రైన్ ఫుల్‌ స్పీడ్‌గా హారన్‌ కొడుతూ వస్తోంది. హెడ్ ఫోన్స్ పెట్టుకోవడంతో ఆ యువతికి ఇది వినపడలేదు. దీంతో రైలు ఆ యువతిని ఢీ కొట్టింది. అయితే లక్కీగా ఆ యువతి చివరి క్షణంలో రైలును చూసి కొంచెం వేగంగా నడవడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఆమెను రైలు బలంగా ఢీ కొట్టడంతో పక్కనున్న ట్రాక్‌పై ఆ యువతి పడిపోయింది. వైరల్ అవుతున్న ఈ వీడియో 'TRThaber' అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.  


మరో ఘటన


రైలు పట్టాలపై దాటే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని రైల్వే శాఖ హెచ్చరికలు చేస్తూనే ఉంటుంది. నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. అయినా కొందరి తీరు మారదు. ఓ మహిళ ఇలాగే పట్టాలు దాటి, తృటిలో  ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఓ క్షణం ఆలస్యమైనా వేగంగా దూసుకొస్తున్న రైలు కింద పడి నుజ్జునుజ్జు అయిపోయేదే. ఐఏఎస్ ఆఫీసర్ అవనీష్ శరణ్ ట్విటర్‌లో ఈ వీడియో షేర్ చేశారు. "జీవితం మీదే. నిర్ణయమూ మీదే" అనే క్యాప్షన్‌ని కోట్ చేశారు. ఆ మహిళతో పాటు ఇంకొందరు అంతే నిర్లక్ష్యంగా పట్టాలు దాటుతూ కనిపించారు. నిజానికి ట్రైన్ ప్లాట్‌ఫామ్ వద్ద ఆగలేదు. మరో ట్రైన్‌ క్రాస్ అవ్వటానికి స్టేషన్‌ రాక ముందే ఓ సిగ్నల్ వద్ద ఆగిపోయింది. ప్లాట్‌ఫామ్ వరకూ వెళ్లటం ఎందుకు అనుకున్నారో ఏమో. కొంత మంది మధ్యలోనే ట్రైన్‌లో నుంచి దిగారు. తమ సామాన్లు తీసుకుని పట్టాలు హడావుడిగా పట్టాలు దాటారు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీశాడు. 




Also Read: Punjab Cop suspended: పుసుక్కున అలా కాల్చేశారేంటి సారూ- వైరల్ వీడియో!