ABP  WhatsApp

Punjab Cop suspended: పుసుక్కున అలా కాల్చేశారేంటి సారూ- వైరల్ వీడియో!

ABP Desam Updated at: 20 Oct 2022 04:31 PM (IST)
Edited By: Murali Krishna

Punjab Cop suspended: పంజాబ్‌లో ఓ పోలీసు అధికారి తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో ఒక వ్యక్తికి గాయమైంది.

(Image Source: ANI)

NEXT PREV

Punjab Cop suspended: పంజాబ్‌ అమృత్‌సర్‌లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. పోలీస్ చేతిలో తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మొబైల్ షాప్‌లో పని చేసే ఓ యువకుడు గాయపడ్డాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది.


ఇదీ జరిగింది


అమృత్‌సర్‌లో ఉన్న ఓ మొబైల్ షాప్‌లో ఈ ఘటన జరిగింది. ఒక పోలీసు అధికారి మొబైల్ షాప్‌లో ఫోన్ రిపైర్ చేయించుకునేందుకు వచ్చారు. అయితే ఆయన తన తుపాకీని బయటకు తీసి అక్కుడున్న వారికి చూపిస్తోన్న సమయంలో ప్రమాదవశాత్తూ అది పేలింది. దీంతో మొబైల్ షాపులో పనిచేస్తున్న యువకుడి శరీరంలోకి బుల్లెట్ దూసుకుపోయింది.






వెంటనే అప్రమత్తమైన షాపు సిబ్బంది.. బాధితుడ్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆ పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు.



ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంబంధిత అధికారిని మేం సస్పెండ్ చేశాం. మేము ఆ సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నాం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.                               -    వారిందర్ సింగ్, ACP నార్త్ అమృత్‌సర్


Also Read: UK New Home Secretary: బ్రిటన్‌లో రాజకీయ గందరగోళం- హోంమంత్రి పదవికి బ్రేవర్మన్ గు‌డ్‌బై!

Published at: 20 Oct 2022 12:09 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.