Delhi High Court Viral Video: 


ఢిల్లీ హైకోర్టులో..


ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్‌లో లాయర్స్‌ గొడవ పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుర్చీల కోసం గొడవ జరిగింది. ఓ సీనియర్ న్యాయవాదిని ఓ మహిళా లాయర్‌ చెంపదెబ్బ కొట్టినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ గొడవ ఫలితంగా క్యాంటీన్‌లో ఫుడ్ అంతా చెల్లాచెదురైంది. న్యాయవాదులు ఒకరితో ఒకరు వాగ్వాదం చేసుకున్నారు. టేబుల్స్‌తో పాటు మరికొందరు డ్రెస్‌లపైనా ఫుడ్ పడిపోయింది. 


"కొంత మంది లాయర్స్ క్యాంటీన్‌లో కూర్చుని లంచ్ చేస్తున్నారు. ఆ సమయంలోనే ఓ మహిళా లాయర్ అక్కడికి వచ్చి వాగ్వాదానికి దిగారు. ఓ టేబుల్‌పై కొంతమంది సీనియర్ లాయర్స్ కూడా ఉన్నారు. ఆమెని ఆపేందుకు చాలా ప్రయత్నించారు. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. అక్కడ చేతికి అందిన ఫుడ్‌ని తీసుకుని అటూ ఇటూగా పడేశారు. ఓ సీనియర్ అడ్వకేట్ వచ్చి ఆమెని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. అది కూడా పట్టించుకోకుండా ఆమె చెంపదెబ్బ కొట్టారు. ఆ తరవాత గొడవ మరింత పెద్దదైంది"


- ప్రత్యక్ష సాక్షి 






లంచ్ చేస్తుండగా..


లంచ్ చేస్తుండగా మధ్యలో వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆ లాయర్ గొడవ చేసినట్టు చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్ష్యులు. అవసరమైతే పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. మహిళలతో ఎలా మాట్లాడాలో సీనియర్ అడ్వకేట్స్‌కి తెలియదంటూ మండి పడ్డారు. తనకు సిటీ సపోర్ట్ మొత్తం ఉంటుందని తేల్చి చెప్పారు. అక్కడే ఉన్న లాయర్స్ ఇదంతా వీడియో తీశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. 


Also Read: Lok Sabha Security Breach: పార్లమెంట్ బయట జర్నలిస్ట్‌ల కొట్లాట,ఆ ఎవిడెన్స్ కోసం తోపులాట - వైరల్ వీడియో