Lok Sabha Security Breach:


జర్నలిస్ట్‌ల కొట్లాట..


లోక్‌సభలో దాడి జరిగిన వెంటనే  సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. సభలోని ఇద్దరిని, పార్లమెంట్ బయట మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. సభలోకి దూసుకెళ్లిన సమయంలో కలర్ గ్యాస్‌తో దాడి చేశారు. పార్లమెంట్ బయట కూడా ఇద్దరు ఆగంతకులు ఇదే కలర్ గ్యాస్‌ని ప్రయోగించారు. వీటికి సంబంధించిన క్యానిస్టర్‌లు అక్కడే పడిపోయాయి. అక్కడి సంఘటన గురించి రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్ట్‌లలో ఓ వ్యక్తి వెంటనే ఆ క్యానిస్టర్‌ని చేతుల్లోకి తీసుకుని వివరించడం మొదలు పెట్టారు. దాడి ఎలా జరిగిందో చెప్పాడు. ఇది చూసిన వెంటనే మిగతా టీవీ ఛానల్స్‌ రిపోర్టర్‌లు (Journalists Fight) ఆ క్యానిస్టర్‌ని లాక్కునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కాసేపు కొట్లాట జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకరిని ఒకరు తోసుకుంటూ క్యానిస్టర్‌ని లాక్కునేందుకు ప్రయత్నించారు జర్నలిస్ట్‌లు. ఇందులో ఓ లేడీ జర్నలిస్ట్ కూడా ఉన్నారు. క్యానిస్టర్ పట్టుకుని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండగా అతడిని అడ్డుకుని మరీ ఘర్షణ పడ్డారు. చుట్టూ ఉన్న వాళ్లంతా వింతగా చూస్తుండడాన్ని గమనించి చివరకు జర్నలిస్ట్‌లంతా నవ్వుకున్నారు. కానీ...అప్పటికే సోషల్ మీడియాలో ఈ వీడియోలపై కామెంట్స్ మొదలయ్యాయి. 






కామెంట్స్..


బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో కేక్ కోసం కొట్టుకుంటున్నట్టుగా ఏంటిది అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. "వీళ్లకు ఆస్కార్ పక్కా" అని మరి కొందరు సెటైర్లు వేశారు. మరి కొందరు కాస్త ఘాటుగానే స్పందించారు. ఎంతో కీలక ఎవిడెన్స్‌  అయిన క్యానిస్టర్‌ మీడియా చేతుల్లోకి ఎలా వెళ్లింది..? ఫోరెన్సిక్ టీమ్ ఏం చేస్తోంది..? అని ప్రశ్నించారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జీరో అవర్ కొనసాగుతుండగా విజిటర్స్ గ్యాలరీలో నుంచి ఇద్దరు ఆగంతకులు సభలోకి దూసుకొచ్చారు. కలర్ గ్యాస్‌ని ప్రయోగించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ బయట మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.