Viral Video: "కుక్కలు మనిషికి మంచి స్నేహితులు" అంటారు. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. తాజాగా ఓ వరుడు తన పెంపుడు కుక్కతో కలిసి బైక్‌పై పెళ్లి వేదికకు వచ్చిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇది చూసిన జంతు ప్రేమికులు ఫిదా అవుతున్నారు.






ఇదీ సంగతి


దర్శన్ నందు అనే వ్యక్తి షేర్వానీ ధరించి బైక్‌పై తన పెంపుడు కుక్కతో వివాహ వేదికలో వస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది. ఈ వీడియో 4 రోజుల క్రితం పోస్ట్ చేయగా ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.7 మిలియన్ల వీక్షణలు, 2 లక్షలకు పైగా లైక్‌లను సంపాదించింది. వరుడు చేసిన ఈ పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.


"చాలా క్యూట్... ఇలా ఉండాలి. ఏ సందర్భంలోనైనా మన స్నేహితులు ముందుగా ఉండాలి" అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో వినియోగదారు ఇలా అన్నాడు.. "వావ్ ప్రతి ఒక్కరూ మీలాగే ఉండాలని, వారి పెంపుడు జంతువును ఇంత మంచిగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను."


ల్యాప్‌టాప్‌తో


ఇటీవల పెళ్లి మండపంలో కూడా ల్యాప్‌టాప్‌తో కుస్తీ పడుతోన్న ఓ వరుడి ఫొటో వైరల్ అయింది.ఇందులో ఓ వైపు పెళ్లి బాజాలు మోగుతూ, పురోహితుడు వేద మంత్రాలు పఠిస్తూ ఉన్నాడు. కానీ పెళ్లి పీటల మీద ఉన్న వరుడు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా.. ల్యాప్‌టాప్‌లో సీరియస్‌గా పని చేసుకుంటున్నాడు. అయితే ఇది ఎక్కడ జరిగింది అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ ఎక్కువగా కోల్‌కతాకు చెందిన అకౌంట్ల నుంచి ఈ పోస్ట్ వచ్చింది. ఏది ఏమైనా ఈ పోస్ట్ మాత్రం వైరల్‌గా మారింది. వర్క్‌ ఫ్రమ్‌ హోం కల్చర్‌ను ఈ పెళ్లికొడుకు మరోస్థాయికి తీసుకెళ్లాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.




Also Read: Volcano In Indonesia: బద్దలైన ఎత్తైన అగ్ని పర్వతం- ఇండోనేసియాలో డేంజర్ బెల్స్!