Bank of India Property E-Auction: ఇల్లు గానీ, స్థలంగానీ, మరేదైనా స్థిరాస్థి గానీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (BOI) మీ కోసమే ఓ ఆఫర్‌ ప్రకటించింది. ఆ బ్యాంక్‌ భారీ స్థాయిలో ఈ-వేలం నిర్వహించబోతోంది. వెయ్యికి పైగా ప్రాపర్టీలను ఈ మెగా ఈ-వేలంలో అమ్మబోతోంది. ఆఫీస్ స్థలం, ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్లు, నివాస గృహాలు, ఖాళీ స్థలాలు, వాణిజ్య దుకాణాలు (కమర్షియల్ షాప్స్), పారిశ్రామిక స్థలాలు, పారిశ్రామిక భవనాలు వంటి వాటిని వేలంలో అందుబాటులోకి తెస్తోంది.


పాన్‌ ఇండియా ప్రాపర్టీస్‌
తక్కువ ధరకే అద్భుతమైన స్థిరాస్తులను కొనుగోలు చేయవచ్చంటూ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో ప్రకటించింది. ఇది పాన్‌ ఇండియా ఆన్‌లైన్‌ ప్రాపర్టీ ఆక్షన్‌. అంటే, దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను బ్యాంక్‌ ఆన్‌లైన్‌ ద్వారా వేలానికి పెడుతోంది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, ముంబయి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు, ఆఫీసులు, షాపులు, ఇండస్ట్రియల్‌ అసెట్స్‌ను బ్యాంక్‌ అమ్మబోతోంది. మీ ఆస్తుల జాబితాను దేశవ్యాప్తంగా పెంచుకోవడానికి ఇదొక చక్కటి అవకాశం.


బ్యాంకులు ఇలాంటి ఈ-వేలంపాటలు నిర్వహించడం పారిపాటి. ఆయా బ్యాంకుల్లో రుణాలు తీసుకుని చెల్లించలేకపోయిన వ్యక్తులు లేదా సంస్థలకు సంబంధించిన హామీ ఆస్తులను బ్యాంకులు స్వాధీనం చేసుకుంటాయి. వాటిని ఆన్‌లైన్‌ ద్వారా లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా (అరుదుగా) వేలం పెట్టి అమ్ముతాయి. వచ్చిన డబ్బును తమ రుణం కింద జమ చేసుకుంటాయి. సెకండ్‌ హ్యాండ్‌ అన్నమాటే గానీ, మంచి ప్రాంతంలో తక్కువ ధరలో మంచి ఆస్తిని కొనడానికి ఈ-వేలం ఒక చక్కటి వేదిక. వీటిని కొనడం వల్ల న్యాయపరమైన చిక్కులు ఏమీ ఉండవు. 


ఈ-వేలం ఎప్పుడు?
ఇది ఆన్‌లైన్‌ ఆక్షన్ కాబట్టి, మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. గంటలకు గంటలు వేచి చూడాల్సిన ఆగత్యం కూడా లేదు. హాయిగా ఇంట్లో కూర్చునే బిడ్‌ వేయవచ్చు. ఈ నెల (డిసెంబర్ 2022‌‌) 9వ తేదీన వేలం జరుగుతుంది.






ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి?
బ్యాంక్ ఆఫ్ ఇండియా అమ్మబోతున్న ఆస్తులు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయో మీరు తెలుసుకోవాలంటే... https://ibapi.in/Sale_info_Home.aspx లేదా https://www.bankofindia.co.in/Dynamic /Tender?Type=3 లింక్స్‌ మీద క్లిక్‌ చేస్తే చాలు. అన్ని వివరాలు మీ కళ్ల ముందు ప్రత్యక్షం అవుతాయి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే 022- 66684884/ 66684862 నంబర్లకు కాల్‌ చేసి నివృతి చేసుకోవచ్చు. మాట్లాడేంత సమయం లేదు అనుకుంటే, మీరు ఈ-మెయిల్‌ కూడా పంపి సందేహాలు తీర్చుకోవచ్చు. HeadOffice.AR@bankofindia.co.in ఐడీకి మీరు ఈ-మెయిల్‌ చేయవచ్చు.


ఆక్షన్‌లో ఎలా పాల్గొనాలి?
బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మెగా ఈ-ఆక్షన్‌లో మీరు పాల్గొనాలని అనుకుంటే.. ఐబీఏపీఐ (IBAPI) వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. లేదంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా కూడా ఆక్షన్‌లో పాల్గొనవచ్చు. లేదంటే మీరు 750 687 1647, 750 687 1749 నంబర్లకు కాల్ చేసి మెగా ఆక్షన్‌ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.