Viral Video:


తరిమికొట్టిన కుక్కలు..


వీధి కుక్కల్ని తక్కువ అంచనా వేయొద్దు. వాటి ఏరియాలో అవే సింహాలు. ఆ వీధిలో వాళ్లు కాకుండా కొత్తగా ఎవరు వచ్చినా అసలు ఊరుకోవు. వెంటపడి మరీ తరుముతాయి. మనుషులే కాదు. క్రూర మృగాలు వచ్చినా లెక్క చేయవు. సింహాలనైనా సరే వెంబడిస్తాయి. సోషల్ మీడియాలో ఇప్పుడో వీడియో వైరల్ అవుతోంది. ఓ వీధిలో కొన్ని కుక్కలు చిరుతను తరిమి కొట్టాయి. దాంతో సమానంగా గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయేంత వరకూ వెంట పడ్డాయి. ఆ చిరుత కుక్కలపై ఎదురు దాడికి దిగాలని చూసినా..చాలా తెలివిగా తప్పించుకున్నాయి  ఆ కుక్కలు. ఆ వీధి దాటి చిరుత వెళ్లిపోయేంత వరకూ కుక్కలు అరుస్తూనే ఉన్నాయి. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ...ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ చీతా చెట్టు పై నుంచి దిగుతుండగా గమనించిన వీధి కుక్కలు గట్టిగా మొరగడం మొదలు పెట్టాయి. వాటిని చూసి చిరుత కాస్త బెదిరింది. అటూ ఇటూ పరుగులు తీసింది. కోపంతో వాటిపై దాడి చేసేందుకూ ప్రయత్నించింది. కానీ...ఆ చిరుత పంజాకు కుక్కలు చిక్కలేదు. దానికి చిరాకు తెప్పించి అక్కడి నుంచి వెళ్లగొట్టాయి. ఓ నెటిజన్ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. "మా వీధిలోని కుక్కలు సింహాలతో సమానం" అని ట్వీట్  చేశాడు. నిజానికి...ఆ చిరుత తలుచుకుంటే కుక్కని వేటాడి చంపేస్తాయి. కానీ...ఇక్కడ ఒకేసారి నాలుగైదు కుక్కలు ఎగబడే సరికి దానికి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి జారుకుంది. అలా ప్రాణాలు కాపాడుకుంది. 






చిన్నారులపై దాడులు..


చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేస్తోన్న ఘటనలు ఇటీవల బాగా పెరిగిపోయాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. అయితే ఈ సారి చిన్నారి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. ఘజియాబాద్‌లోని 11 ఏళ్ల బాలికపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసేందుకు ప్రయత్నించాయి. ఆ చిన్నారి తన అపార్టమెంట్‌ కమ్యూనిటీ నుంచి బయటకు వెళ్లగా ఒకేసారి ఓ కుక్కల గుంపు ఆమె మీదకు దూకాయి. ఇది గమినించిన ఆ బాలిక వెంటనే పరుగులు పెట్టింది. ఎక్కడా ఆగకుండా తన అపార్టమెంట్స్‌ కమ్యూనిటీ గేట్‌లోకి ఆ చిన్నారి వెళ్లిపోవటంతో ఆ కుక్కల బారి నుంచి తప్పించుకోగలిగింది. ఆమె ఇలా గేట్‌లోకి రాగానే వెంటనే అక్కడ ఉన్నసెక్యూరిటీ 
సిబ్బంది బయటకు వచ్చారు. దీంతో ఆ క్కుక్కలు తోక ముడిచి వెనుదిరిగాయి. ఆ బాలిక ఏమాత్రం అజాగ్రత్తగా ఉండి ఉన్నా ఈ పాటికి మరో చిన్నారి కుక్కలకు బలయ్యేది.