ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) యూనిట్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా 260 ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 29న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. డిసెంబరు 14 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 260
1) ట్రైనీ ఇంజనీర్-I: 180 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్-35, ఎలక్ట్రానిక్స్ - 112, కంప్యూటర్ సైన్స్ - 25, సివిల్ - 04, ఎలక్ట్రికల్ - 04.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/బీఎస్సీ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత ఉండాలి. అంతే కాకుండా సంబంధిత పోస్ట్ క్వాలిఫికేషన్‌లో 1 సంవత్సరం పాటు ఫుల్‌టైం ఇండస్ట్రియల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
వయోపరిమితి: 14.12.2022 నాటికి 28 సంవత్సరాలలోపు ఉండాలి.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30 వేలు, రెండో ఏడాది రూ.35 వేలు, మూడో ఏడాది రూ.40 వేల వేతనం లభిస్తుంది.
2) ప్రాజెక్ట్ ఇంజినీర్ - I: 80 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్ - 26, ఎలక్ట్రానిక్స్-38, కంప్యూటర్ సైన్స్-05, సివిల్ - 03, ఎలక్ట్రికల్ - 08
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/బీఎస్సీ ఉత్తీర్ణత, సంబంధిత పోస్ట్ క్వాలిఫికేషన్‌లో 2 సంవత్సరాల ఫుల్‌టైం ఇండస్ట్రియల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
వయోపరిమితి: 14.12.2022 నాటికి 32 సంవత్సరాలలోపు ఉండాలి.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.40 వేలు, రెండో ఏడాది రూ.45 వేలు, మూడో ఏడాది రూ.50 వేలు, నాలుగో ఏడాది రూ.55 వేల వేతనం లభిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు రూ.150, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు రూ.400. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.11.2022.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 14.12.2022.
Also Read:
ఏపీలో 461 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, అర్హతలివే! దరఖాస్తు చివరితేది ఎప్పుడంటే?
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ప్రజారోగ్య & కుటుంబ సంక్షేమ సంచాలకులు 461 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచారు. జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ (లేదా) బీఎస్సీ(నర్సింగ్) అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆఫ్‌లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబరు 5 వరకు దరఖాస్తులు సమర్పణకు అవకాశం ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
ఏపీలో 6,100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?
ఏపీలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి (APSLPRB) నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే పదోతరగతి పాసై, ఇంటర్ చదువుతూ ఉండాలి. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నవంబరు 30న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 28న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
కేంద్ర కొలువులకు నోటిఫికేషన్ - పోస్టులు, అర్హతల వివరాలు ఇలా!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ ఉద్యోగాల భర్తీకి నవంబరు 26న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 15 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.