Jal Shakti Ministry Twitter:


అనుమానాస్పద ట్వీట్‌లు..


ఎంత టెక్నాలజీ వచ్చినా...ఎంత సెక్యూరిటీ పెంచుకుంటున్నా...యాప్స్‌, వెబ్‌సైట్స్‌ హ్యాక్‌కు గురి కాకుండా చూడలేకపోతున్నారు. ఏకంగా ప్రభుత్వ సోషల్ మీడియా అకౌంట్లనూ హ్యాక్ చేసేస్తున్నారు. ఇప్పుడు అదే జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన ట్విటర్ హ్యాండిల్‌ హ్యాక్‌కు గురైంది. గత వారమే ఢిల్లీ AIIMS హాస్పిటల్ సర్వర్‌ హ్యాక్‌ కాగా...ఇప్పుడు జలశక్తి మంత్రిత్వల శాఖ ట్విటర్‌అకౌంట్‌ హ్యాక్ అయింది. మంగళవారం ఉదయం ఉన్నట్టుండి అకౌంట్‌లో అనుమానాస్పద ట్వీట్‌లు కనిపించాయి. క్రిప్టో వ్యాలెట్  Sui Walletని ప్రమోట్ చేస్తూ వరుసగా పోస్ట్‌లు వచ్చాయి. ఉదయం 5.38 గంటలకు ఈ ట్వీట్ కనిపించింది. అంతేకాదు. ఆ అకౌంట్ డీపీ త్రివర్ణ పతాకం ఉండగా...దాన్నీ మార్చేశారు హ్యాకర్లు. జెండా స్థానంలో... Sui Wallet లోగోను సెట్ చేశారు. కవర్ పేజ్‌నూ మార్చేశారు. ఈ పోస్ట్‌తో పాటు మరెన్నో గుర్తు తెలియని అకౌంట్‌లను ట్యాగ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు...అకౌంట్‌ను రికవరీ చేశారు. పాత పోస్ట్‌లన్నీ డిలీట్ చేశారు. సెక్యూరిటీ ఏజెన్సీలతో పాటు సైబర్ నిపుణులు...దీనిపై పూర్తి స్థాయివిచారణ  కొనసాగిస్తున్నారు. ఇటీవలే నవంబర్ 23న ఢిల్లీలోని AIIMS సర్వర్‌లు ఉన్నట్టుండి పని చేయకుండా పోయాయి. రూ.200 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీ ఇవ్వాలని హ్యాకర్లు డిమాండ్ చేసినట్టు తెలిసింది. కానీ...పోలీసులు మాత్రం దీన్ని ఖండించారు. సైబర్ టెర్రరిజం కింద కేసు నమోదు చేసిన పోలీసులు...విచారణ కొనసాగిస్తున్నారు. దాదాపు 3-4కోట్ల మంది పేషెంట్ల డేటాను హ్యాకర్లు దొంగిలించినట్టు తెలుస్తోంది. 






టాటా పవర్‌పైనా దాడి..


టాటా పవర్ తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై సైబర్ దాడి జరిగిందని, దీని కారణంగా సిస్టంలు ఎఫెక్ట్ అయ్యాయని కంపెనీ తెలిపింది. టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఈ సైబర్ దాడి జరిగింది. ఈ దాడి కొన్ని ఐటీ సిస్టమ్‌లపై ప్రభావం చూపిందని బీఎస్‌ఈ ఫైలింగ్ తెలిపింది. సిస్టమ్‌లను పునరుద్ధరించడానికి కంపెనీ చర్యలు తీసుకుందని సమాచారం. అయితే అన్ని కీలకమైన ఆపరేషనల్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా, ఎంప్లాయీ అండ్ కస్టమర్ ఫేసింగ్ పోర్టల్‌లు, టచ్ పాయింట్‌లకు యాక్సెస్‌ను రిస్ట్రిక్ట్ చేశారు. ఎప్పటికప్పుడు వాటిని చెక్ చేస్తున్నారు. 


5జీ సేవలంటూ మోసాలు..


ప్రస్తుతం 5జీ సేవల వినియోగం కోసం కస్టమర్లు ఉత్సాహంగా ఉన్నారు. ఈ క్రమంలో ‘4జీ నుంచి 5జీ మారండి. మీకు కావాల్సిన సేవలు మేం అందిస్తాం’ అంటూ.. కొంతమంది సైబర్‌ కేటుగాళ్లు మెసేజ్‌లు, లింక్‌లు పంపిస్తున్నారు. అదంతా నిజమని నమ్మిన కస్టమర్లు ఆ లింక్‌లను క్లిక్‌ చేస్తే ఫోన్‌లోని డేటా అంతా సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుంది. దాంతో బ్యాంకు ఖాతాలకు లింక్‌ అయి ఉన్న ఫోన్‌నంబర్‌ తెలుసుకుంటా రన్నారు. ఆ నంబర్‌ను బ్లాక్‌ చేయించి, సిమ్‌ స్వాప్‌ దందాకు పాల్పడి, అదే నంబర్‌తో మరోసిమ్‌ తీసుకుని బ్యాంకు ఖాతాలకు లింక్‌ చేసి డబ్బంతా కొల్లగొడతారు. లేదా 5జీ సర్వీస్‌లు అందిస్తున్నామంటూ వివిధ రకాల ఛార్జీల పేరుతో అందినంతా దండుకొని ఉడాయిస్తారు. ఇటువంటి పలు రకాల సైబర్‌ మోసాలపై కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 


Also Read: India's Jobless Rate: నిరుద్యోగ భారతం- భారీగా పెరిగిన అన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ రేటు!