India's Jobless Rate: దేశంలో నిరుద్యోగిత రేటు భారీగా పెరిగినట్లు తాజా నివేదికలో తేలింది. నిరుద్యోగిత రేటు నవంబర్‌లో 8.0%కి పెరిగింది. ఇది మూడు నెలల్లో అత్యధికం. గత నెలలో 7.77%గా అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేటు ఉంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) గురువారం ఈ డేటాను విడుదల చేసింది. 


ఇలా ఉంది






పట్టణ నిరుద్యోగిత రేటు గత నెలలో 7.21% ఉండగా నవంబర్‌లో 8.96 శాతానికి పెరిగింది. మరోవైపు గ్రామీణ నిరుద్యోగిత రేటు 8.04% నుంచి 7.55%కి పడిపోయినట్లు నివేదిక తెలిపింది. 

 

నెలవారీ గణాంకాలను ప్రభుత్వం విడుదల చేయనందున ముంబయికి చెందిన CMIE నుంచి వచ్చిన డేటాను ఆర్థికవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు. నిరుద్యోగిత రేటు భారీగా పెరగడంతో ఉద్యోగార్థులు ఆందోళన చెందుతున్నారు. కొత్త కొలువులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ముప్పు లేదు

 

ఓ వైపు నిరుద్యోగిత రేటు పెరుగుతున్నప్పటికీ భవిష్యత్తులో భారత్‌లో ఉద్యోగాల భర్తీ జోరుగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ దేశాలు మాంద్యం (Recession) ముప్పు పొంచి ఉందని భయపడుతున్నాయి. కానీ భారత్‌ (India)లో మాత్రం మాంద్యం ప్రభావం అంతగా ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత నియామక ధోరణులు చూస్తే కొన్ని సంవత్సరాలలో భారత్‌ బలమైన ఉపాధి వృద్ధి రేటును చూసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు బిజినెస్ సర్వీసెస్ ప్రొవైడర్ Quess Corp వ్యవస్థాపకుడు, నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అజిత్ ఐజాక్ తెలిపారు. 

 



ప్రపంచ దేశాలతో పోలిస్తే మాంద్యానికి భారత్ చాలా దూరంగా ఉంది. భారత్‌లో మనం వృద్ధిని చూస్తూనే ఉంటాం. బహుశా 8% కాదు.. కానీ మేము వృద్ధిని చూస్తాము. 2000, 2007 సంవత్సరాల మధ్య ఉపాధిలో గొప్ప వృద్ధిని చూశాం. దేశ జీడీపీ 2000లో $470 బిలియన్ల నుంచి 2007లో $1.2 ట్రిలియన్లకు పెరిగింది. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తే కొన్ని సంవత్సరాలలో అలాంటి వృద్ధి రేటును తిరిగి చూడగలుగుతాం.                                   "
-అజిత్ ఐజాక్, Quess Corp వ్యవస్థాపకుడు



బెంగళూరులో ఇటీవల జరిగిన జాబ్ అన్వేషణ పోర్టల్ మాన్‌స్టర్ ఇండియా, ఎస్‌ఇ ఆసియా, మిడిల్ ఈస్ట్‌ల టాలెంట్ ప్లాట్‌ఫామ్ 'ఫౌండిట్‌' రీబ్రాండింగ్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీని ద్వారా ఉద్యోగులు, మేనేజర్‌లను నియమించుకోవడానికి అనేక రకాల సేవలను అందిస్తున్నట్లు ఐజాక్ చెప్పారు.


Also Read: Viral Video: రెచ్చిపోయిన ఆకతాయిలు- కొరియన్ యువతిని వేధించి, కిస్ చేసి!