Viral Video: కుక్కలను "మనిషి బెస్ట్ ఫ్రెండ్" అంటారు. ఎందుకంటే ఎన్ని ఆపదలు వచ్చినా.. అవి యజమానిని రక్షిస్తూనే ఉంటాయి. మోస్ట్ లవబుల్ పెట్‌గానే కాకుండా.. భద్రతా సేవల్లో కూడా కుక్కల పాత్ర చాలా ఎక్కువ.
జవాన్లు చేసే ఎన్నో ఆపరేషన్లలో ఆర్మీ డాగ్స్ పాత్ర చాలా కీలకం. అందుకే జవాన్లు, శునకాల మధ్య ఆ స్నేహం కూడా అలానే ఉంటుంది. తాజాగా ఓ డాగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఆర్మీ డాగ్.. జవాన్ చేస్తోన్న వర్కవుట్‌ను మక్కీకి మక్కీ దించేసింది. దిల్లీ మెట్రో స్టేషన్లో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. ఈ కుక్క The Central Industrial Security Force (CISF) సైనికుడి వర్కవుట్‌లను కాపీ చేసింది. ఈ వైరల్ వీడియో నెటిజన్లను ఫిదా చేస్తోంది.
జూమ్ డాగ్
ఇండియన్ ఆర్మీలో ఎన్నో ఆపరేషన్లలో పాల్గొన్న "జూమ్" డాగ్ (Zoom Dog) ఇటీవలే మృతి చెందింది. శ్రీనగర్‌లోని వెటిర్నరీ హాస్పిటల్‌లో చికిత్స పొందిన తర్వాత ఈ శునకం చనిపోయింది.
జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా టాంగ్‌పావా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం భద్రతా దళాలకు అందింది. దీంతో ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులు, భధ్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో 'జూమ్' అనే ఆర్మీ కుక్క తీవ్రంగా గాయపడింది. ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంటిని తొలుత భద్రతా దళాలు గుర్తించాయి. దీంతో సైన్యం.. ఉగ్రవాదులు ఉంటున్న ఇంటికి 'జూమ్' అనే ఆర్మీ కుక్కను పంపారు. దీంతో 'జూమ్' ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసింది. ఆ సమయంలో కుక్క శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. అయినప్పటికీ లెక్కచేయకుండా 'జూమ్' వీరోచితంగా పోరాడింది. దీని ఫలితంగా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత అధికారులు 'జూమ్'ను హుటాహుటిన ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ఈ 'జూమ్' శిక్షణ పొందిన నిబద్ధత కలిగిన వీర శునకమని అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసి పట్టుకోవడంలో 'జూమ్' నేర్పరి.
Also Read: Bihar News: మధ్యాహ్న భోజనంలో బల్లి- 200 మంది పిల్లలు ఆసుపత్రిపాలు!