Intelligent women: టెక్సాలజీ అందుబాటులోకి వచ్చాక మొబైల్ ఫోన్ లేని వారే కనిపించడం లేదు. సామాన్యుల నుంచి మొదలుకుని, కూరగాయల బండి దగ్గర ఉండే ముసలివాళ్ల వరకు స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. అంతేకాదండోయ్ స్మార్ట్ ఫోన్ ద్వారా సోషల్ మీడియాలో వినూత్న వీడియోలను షేర్ చేస్తూ ఫేమస్ అవుతున్నారు. సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలో జరిగే వింతలన్నీ ఇంట్లో కూర్చుండి చూసే సౌకర్యం లభించింది. అందులోను సోషల్ మీడియా మీద మక్కువ ఉన్నవారు వారి టాలెంట్ ను వీడియో రూపంలో నెటిజన్లకు పంచుకుంటున్నారు. దీంతో, ఫేమస్ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అయితే, తాజాగా ఓ మహిళ చేసిన వినూత్న ఆలోచనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


భలే ఐడియా గురు...


నీళ్లు కావాలంటే బావి నుంచి చెదడం ఒకప్పటి మాట. ఇప్పుడు అంతా టెక్నాలజీ వరల్డ్. ఎక్కడ చూసిన కష్టం లేకుండా తెలివిగా పని అయిపోయే విధానాలను మాత్రమే ప్రజలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇదే తరహాలో ఓ మహిళ టెక్సాలజీని వాడకపోయినా తన మెదడుకు పని పెట్టింది. తన ఇంట్లో వాడే టూత్ పేస్ట్‌తో తెలివైన పని చేసింది. నీటి ట్యాంక్‌ నుంచి  తనకు అవసరమైనప్పుడల్లా నీటిని వాడుకుంటుంది. ఆ తర్వాత నీటిని కట్టేసేందుకు మహిళ చేసిన ఆలోచన నెటిజన్లను ఆకర్షిస్తుంది.


నీటిని ఉపయోగించిన అనంతరం దానిని కట్టిపెట్టేందుకు రోజు వాడే టూత్ పేస్ట్ ప్యాకెట్ ను ఉపయోగించింది. టూత్ పేస్ట్ అయిపోయాక, దానిని పడేయకుండా కడిగేసింది. టూత్ పేస్ట్ ప్యాకెట్ వెనుక భాగాన్ని కత్తిరించింది. అనంతరం దానిని పైపునకు తొడిగింది. ఇక తనకు అవసరం ఉన్నపుడల్లా టూత్ పేస్ట్ మూతను తెరిచి నీటిని తీసుకుని ఆ తర్వాత మళ్లీ మూత పెట్టి నీటిని ఆపేస్తుంది. ఈ విధంగా టాప్ సహాయం అవసరం లేకుండా తానే ఒక టాప్ ను తయారుచేసుకుంది. అయితే, ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేస్తూ చాలా ప్రాక్టికల్ విమెన్ అంటూ వీడియోను షేర్ చేశాడు.






వీడియోను చూసిన నెటిజన్లు కూడా తమ స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు. మా ఇండియాలో దీనినే జుగాడ్ అంటారు అని ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ తల్లి అంటే ఆవశ్యకత ఆవిష్కరణ అంటూ కామెంట్ చేశాడు. ఇక మరొకరు తప్పకుండా ఆ మహిళ భారతదేశానికి చెందిన వారే అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఏది ఏమైన మహిళ చేసిన ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మన ఇంట్లో ఉండే వాటితోనే మనకు సంబంధించిన చాలా అవసరాలను తీర్చుకోవచ్చని, కానీ దానికి ఆ మహిళ వలె కాస్త ఆలోచించే శక్తి ఉండాలంటూ చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ టాప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోకి 24.4కే లైక్స్, 2556 రీట్వీట్స్, 126 కోట్ ట్వీట్స్ వచ్చాయి.