Viral News:


క్యారీబ్యాగ్‌లో నాలుగడుగుల పాము..


అమెరికాలోని ఓ ఎయిర్‌ పోర్ట్‌లో చెక్‌ ఇన్‌ వద్ద ఓ మహిళ బ్యాగ్‌ను తనిఖీ చేసిన అధికారులు షాక్ అయ్యారు. తన క్యారీబ్యాగ్‌లో పాముని పట్టుకొచ్చింది. ఫ్లైట్‌తో తనతో పాటు తీసుకెళ్లాలని అనుకుంది. కానీ...అధికారుల చెకింగ్‌తో అందుకు బ్రేక్ పడింది. అమెరికాలోని టంపా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందీ ఘటన. ఆమె క్యారీబ్యాగ్‌లో నాలుగు అడుగుల పాముని గుర్తించారు. ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ 
సిబ్బంది ఆ బ్యాగ్ స్కానింగ్ ఫోటోను కూడా షేర్ చేశాయి. అందులో చాలా స్పష్టంగా పాము కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది. షూ, ల్యాప్‌టాప్‌తో పాటు పాము అందులో కనిపించింది. అయితే...ఈ ఘటన గతేడాది డిసెంబర్‌ 15న జరిగినట్టు ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన ఓ పోస్ట్ కూడా పెట్టింది. "ఈ బ్యాగ్‌లో ప్రమాదకరమైన పాము ఉంది. ఎక్స్‌రే మెషీన్‌తో స్కాన్‌ చేసినప్పుడు ఇది తెలిసింది" అని తెలిపింది. ఇదే సమయంలో ఎయిర్‌పోర్ట్‌కు పెట్స్‌ను తీసుకొచ్చే విషయంలో నియమ నిబంధనలు మరోసారి గుర్తు చేసుకోవాలని సూచించింది. చాలా చోట్ల పాముల్ని క్యారీ బ్యాగ్‌లలో పెట్టుకుని తీసుకురావడంపై ఆంక్షలు విధిస్తారు. ఒకవేళ అవి హానికరం కావు అని తెలిస్తేనే అనుమతినిస్తారు. "ఎయిర్‌లైన్స్‌ రూల్స్ తెలియకపోతే ఓ సారి తెలుసుకోండి. సాధారణంగా ఏ ఎయిర్‌లైన్స్ కూడా పాముల్ని క్యారీ చేయడానికి అంగీకరించదు. సరైన విధంగా ప్యాకింగ్ చేస్తే కానీ అనుమతించదు" అని స్పష్టం చేసింది. అయితే...ఈ ఘటనపై మహిళ స్పందించింది. ఇది తనకెంతో ఇష్టమైన పెట్‌ అని అందుకే తీసుకొచ్చానని వివరించింది. ఆమె తీసుకొచ్చిన పాము Boa Constrictor అని, విషపూరితం కాకపోయినా అవి హాని చేస్తాయని అధికారులు తెలిపారు. 


కార్గోలో  పాము..


గతేడాది డిసెంబర్‌లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) కార్గోలో పాము కనిపించడం కలకలం రేపింది. కాలికట్ నుంచి దుబాయ్‌కు వెళ్లిన ఫ్లైట్‌లోని కార్గోలో సిబ్బందికి పాము కనిపించింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది. దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాక...కార్గోలో పాము కనిపించడం వల్ల సిబ్బంది కాస్త కంగారు పడ్డారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా దింపిన తరవాత అగ్నిమాపక సిబ్బందికి ఈ విషయం తెలియజేశారు. ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. హ్యాండ్‌లింగ్ స్టాఫ్‌ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగి ఉంటుందని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పారు. అటు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధులు మాత్రం ఈ ఘటనపై మాట్లాడేందుకు నిరాకరించారు. విమానంలో ఇలాంటివి జరగటం ఇదే తొలిసారి కాదు. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి న్యూజెర్సీకి వచ్చిన యునైటెడ్ ఫ్లైట్‌లోనూ పాము వెలుగులోకి వచ్చింది. విమాన సిబ్బంది వచ్చి ఆ పాముని పట్టుకోవడం వల్ల ప్రయాణికులకు ఎలాంటి హానీ కలగలేదు. 


Also Read: Surendran K Pattel: బీడీలు చుట్టిన వ్యక్తి అమెరికాలో జడ్జ్ అయ్యాడు, చరిత్ర సృష్టించిన భారతీయుడు