తెలంగాణ ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్‌-1  పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 8న రాతపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్ష పర్యవేక్షణ కోసం అన్ని కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్‌లను, లైజన్ ఆఫీసర్లను, రూట్ ఆఫీసర్లను, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లను నియమించారు. OMR పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష (150 మార్కులకు), మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 (150 మార్కులకు) పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందువరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి.


హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్‌లో 181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) పోస్టుల భర్తీకి ఆగస్టు 27న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 8 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రాతపరీక్ష హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ జనవరి 2న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 8న ఓఎంఆర్ విధానంలోనే రాతపరీక్ష నిర్వహించనున్నారు.


పరీక్ష విధానం, సిలబస్ వివరాలు...



పోస్టుల వివరాలు..


* ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్-1 పోస్టులు


పోస్టుల సంఖ్య: 181 


జోన్లవారీగా ఖాళీలు: కాళేశ్వరం-26, బాసర-27, రాజన్న సిరిసిల్ల-29, భద్రాద్రి-26, యాదాద్రి-21, చార్మినార్-21, జోగుళాంబ-31.


విభాగం: ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్.


అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (హోంసైన్స్/సోషల్ వర్క్/సోషియాలజీ/ఫుడ్ సైన్స్ & న్యూట్రీషన్/ ఫుడ్ & న్యూట్రీషన్/బోటనీ/జువాలజీ & కెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ/అప్లైడ్ న్యూట్రీషన్ & పబ్లిక్ హెల్త్/ క్లినికల్ న్యూట్రీషన్ & డైటేటిక్స్/ ఫుడ్ సైన్సెస్ & క్వాలిటీ కంట్రోల్/బయోలాజికల్ కెమిస్ట్రీ/ఫుడ్ సైన్సెస్ & మేనేజ్‌మెంట్/ఫుడ్ టెక్నాలజీ & న్యూట్రీషన్/ఫుడ్ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్). మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు 02.07.1978 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, NCC అభ్యర్థులు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ-బీసీ-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: రూ.280. ఇందులో రూ.200 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా, రూ.80 పరీక్ష ఫీజుగా చెల్లించాలి. నిరుద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 


ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.


 నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..