ABP  WhatsApp

Uttar Pradesh News: ఉత్తర్‌ప్రదేశ్‌ ఓటర్ల జాబితాలో పాకిస్థాన్ మహిళ పేరు!

ABP Desam Updated at: 14 Nov 2022 10:34 AM (IST)
Edited By: Murali Krishna

Uttar Pradesh News: ఉత్తర్‌ప్రదేశ్‌ ఓటర్ల జాబితాలో పాకిస్థాన్ మహిళ పేరు ఉండటం కలకలం రేపింది.

ఉత్తర్‌ప్రదేశ్‌ ఓటర్ల జాబితాలో పాకిస్థాన్ మహిళ పేరు!

NEXT PREV

Uttar Pradesh News: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓటరు జాబితాలో పాకిస్థాన్ మహిళ పేరు ఉందన్నా వార్త సంచలనం రేపింది. మోరాదాబాద్‌లో జరిగిన ఈ ఘటన బయటకు రావడంతో వెంటనే అధికారులు  పాక్ మహిళ పేరును జాబితా నుంచి తొలగించారు.


ఇదీ జరిగింది


పాకిస్థాన్‌కు చెందిన సబా పర్వీన్ అనే మహిళకు 2005లో నదీమ్ అహ్మద్‌తో వివాహమైంది. ఆ తర్వాత ఆమె పక్బరా నగర్ పంచాయతీలో నివాసం ఉంటోంది. ఆమె ప్రస్తుతం దీర్ఘకాలిక వీసాపై ఈ ప్రాంతంలో నివాసం ఉంటోంది. 2017వ సంవత్సరంలో నగర పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు సబా పర్వీన్ పేరు తొలిసారి ఓటరు జాబితాలో చేరిందని జిల్లా కలెక్టర్ శైలేంద్ర కుమార్ సింగ్ తెలిపారు.



ఇటీవల ఓటరు జాబితాపై విచారణ చేపట్టాం. ఆ సమయంలోనే ఈ వ్యవహారం గురించి తెలిసింది. ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే ఓటరు జాబితా నుంచి ఆమె పేరును అధికారులు తొలగించారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ వివాదంపై దర్యాప్తు కూడా సాగుతోంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.                                                                       -   శైలేంద్ర కుమార్ సింగ్, జిల్లా కలెక్టర్ 


ఓటర్ల జాబితా




భారతదేశంలో 100 ఏళ్లు పైబడిన ఓటర్లు 2.49 లక్షల మంది ఉన్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇటీవల వెల్లడించారు. 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 1.8 కోట్ల మంది ఉన్నట్లు తెలిపారు. 


Also Read: Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హంతకులపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాట్ కామెంట్స్

Published at: 14 Nov 2022 10:27 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.