Uttar Pradesh News: 


62 చెంచాలు బయటపడ్డాయ్..


ఎవరైనా ఆకలేస్తే నచ్చినవి వండుకుని తింటారు. లేదంటే ఆర్డర్ చేసుకుని లాగించేస్తారు. కానీ...కొందరు వెరైటీ ఫుడ్ తీసుకుంటారు. కొందరు మట్టి తిని బతికితే ఇంకొందరు ఒట్టి బియ్యం మింగేస్తారు. యూపీలోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి చెంచాలు తినేశాడు. అవును. ఓ ఏడాది కాలంగా ఇలా స్పూన్‌లను మింగేయటం అలవాటు చేసుకున్నాడట 32 ఏళ్ల విజయ్. చివరకు కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. ఎంతో శ్రమ పడిన డాక్టర్లు...అతడి పొట్టలో నుంచి 62 చెంచాలు బయటకు తీసి ఆశ్చర్యపోయారు. ICUలో ఉంచి దాదాపు రెండు గంటల పాటు ఆపరేషన్ చేస్తే కానీ...ఇవి బయటపడలేదు. "చెంచాలు తింటున్నావా" అని వైద్యులు అడిగితే ఆ బాధితుడు "అవును ఏడాది నుంచి మింగేస్తున్నా" అని సమాధానమిచ్చాడట. ఇది విని డాక్టర్లు అవాక్కయ్యారు. "ఏడాదిగా ఇలా స్పూన్లు మింగేస్తున్నాడు. రెండు గంటల పాటు శ్రమిస్తే కానీ అవన్నీ బయటకు తీయలేకపోయాం" అని వైద్యులు వెల్లడించారు. ఇప్పుడే కాదు. గతంలోనూ ఇలాంటి కేసులు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. 






గతంలోనూ ఇలాంటి కేసులు


2019లో హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ జిల్లాలోనూ ఓ వ్యక్తి ఇలానే చెంచాలు మింగేశాడు. ఒట్టి చెంచాలతో ఆగలేదు. స్క్రూ డ్రైవర్లు, రెండు టూత్‌బ్రష్‌లు, కత్తి లాగించేశాడు. తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు ఆ వ్యక్తి. వైద్యులు ఆపరేషన్ చేసి వీటన్నింటినీ బయటకు తీశారు. 35 ఏళ్ల ఈ బాధితుడు శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్‌లో అడ్మిట్ అయ్యాడు. కడుపులో ఏదో ఉందని అనుమానంతో వైద్యుల్ని సంప్రదించాడు. వైద్యులు ఎక్స్‌రే తీసి షాక్ అయ్యారు. అర్జెంట్‌గా సర్జరీ చేయాల్సిందేనని చెప్పి ముగ్గురు సర్జన్లు రంగంలోకి దిగారు. 4 గంటల పాటు శ్రమించి ఆ బాధితుడు మింగిన వస్తువులను బయటకు తీశాడు. మానసిక సమస్యలు ఎదుర్కొనే వాళ్లే ఇలా అసహజ రీతిలో అన్నీ మింగేస్తారని అంటున్నారు వైద్యులు. 


Also Read: Fact Check : తిరుపతిలో దేవుడి బొమ్మలు తీసేసి వైఎస్ఆర్‌సీపీ రంగులు వేశారా ? రాజకీయ విమర్శల్లో నిజం ఎంత ?


Also Read: KCR National Party : జాతీయ పార్టీపై ముందుకే కేసీఆర్ - దసరా రోజున పార్టీ పేరు ప్రకటన !?