Fact Check :  ఆంధ్రప్రదేశ్‌లో ఆన్ని రాజకీయ పరమైన అంశాలే. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుపతిలో కూడా అలంకరణలు చేశారు. అయితే రెండు రోజులుగా సోషల్ మీడియాలో తిరుపతిలో ముఖ్యంగా అలిపిరికి వెళ్లే దారిలో వైఎస్ఆర్‌సీపీ రంగుు, ఫ్లెక్సీలతో నింపేశారని వీడియోలు వైరల్ అయ్యాయి. ఎక్కడా దేవుడి బొమ్మలే కనిపించలేదు. గోడలకు ఉండాల్సిన దేవుడి బొమ్మలు తొలగించి వైఎస్ఆర్‌సీపీ రంగులు వేశారని కొంత మంది మండిపడ్డారు. 





అయితే ఈ ఆరోపణలను వైఎస్ఆర్‌సీపీ ఖండించింది. దేవుడి బొమ్ములు అలాగే ఉన్నాయని.. తెలుగుదేశం పార్టీ నేతలు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మండి పడింది. 


 





 ఈ విమర్శలకు తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సమాధానం ఇచ్చింది. కిలోమీటర్ల మేర ఉండే దేవుడి బొమ్మలను తొలగించి.. ఓ నాలుగు బొమ్మలను మాత్రం ఉంచారని.. మిగతా మొత్తం తొలగించారని స్పష్టం చేసింది. ఆ మేరకు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.  





తిరుపతిలో అలిపిరికి వెళ్లే మార్గంలో గోడలకు దేవుడి బొమ్ములు చాలా కిందట వేశారు. దేవదేవుడ్ని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తుల మనసుల్లో ఆ బొమ్మలుమరింత ఆధ్యాత్మికం నింపుతాయని అనుకున్నారు. అయితే కొంత మంది వైఎస్ఆర్‌సీపీ నాయకులు అత్యాత్సాహుంతో  చాలా భాగంగోడలకు వైఎస్ఆర్‌సీపీరంగులు వేసేశారు. రాత్రికి రాత్రి ఈ రంగులు వేసేయడంతో చాలా మంది తిరుపతి ప్రజలు కూడా  అవాక్కయ్యారు. ఈ విషయమే ఇప్పుడు దుమారంరేపుతోంది. అయితే అన్ని బొమ్మలపై అలా చేయలేదని.. కొన్ని దేవుడి  బొమ్మలను ఉంచారని తాజా వీడియోల్లో స్పష్టమవుతోంది.