ABP  WhatsApp

Joe Biden Advice: బాలికకు బైడెన్ సలహా- అప్పటివరకు సీరియస్‌ డేటింగ్ వద్దట!

ABP Desam Updated at: 17 Oct 2022 11:33 AM (IST)
Edited By: Murali Krishna

Joe Biden Advice: ఓ బాలికకు డేటింగ్ సలహా ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.

(Image Source: Twitter)

NEXT PREV

Joe Biden Advice: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు అప్పుడప్పుడూ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ బాలికకు బైడెన్ డేటింగ్‌ సలహా ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఇదీ జరిగింది


కాలిఫోర్నియాలోని ఇర్విన్‌ వ్యాలీ కమ్యూనిటీ కాలేజీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి బైడెన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాంపస్‌లో విద్యార్థులతో సరదాగా ఫొటోలు దిగారు అధ్యక్షుడు. ఆ సమయంలో తన ముందు నిల్చున్న బాలికకు బైడెన్ ఓ సలహా ఇచ్చారు.







 నా కుమార్తెలు, మనవరాళ్లకు ఇదే సలహా ఇచ్చాను. 30 ఏళ్లు వచ్చేవరకు సీరియస్‌ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లొద్దు. ఇది నా సలహాగా తీసుకో.                                          -   జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు


అధ్యక్షుడి సలహా విని ఆ బాలిక కొంచెం షాక్ అయింది. అయితే ఈ సలహాను తాను దృష్టిలో ఉంచుకుంటానని ఆమె చెప్పింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇటీవల


బైడెన్‌కు సంబంధించిన ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఓ వేదికపై గందరగోళానికి గురైన బైడెన్.. తన ప్రసంగం తర్వాత ఎటువైపు వెళ్లాలో అర్థం కాక తికమకపడ్డారు.




ఇదీ జరిగింది


న్యూయార్క్‌లో గ్లోబల్‌ ఫండ్స్‌కు చెందిన సమావేశంలో బుధవారం జో బైడెన్ ప్రసంగించారు. అనంతరం పోడియం దగ్గరి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఆగిపోయారు. ఎటువైపు వెళ్లాలో అర్థం కాక తికమకపడ్డారు. అక్కడే ఏదో మాట్లాడినా చప్పట్ల శబ్దంలో అది కూడా వినిపించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read: Pakistan PM on Biden: 'మాది బాధ్యత గల దేశం'- జో బైడెన్‌ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని

Published at: 17 Oct 2022 11:27 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.