US North Korea Tensions:


అక్రమంగా సిగరెట్‌ల విక్రయం 


అమెరికా, నార్త్ కొరియా మధ్య వైరం రోజురోజుకీ ముదురుతోంది. ఇటీవల దక్షిణ కొరియా, అమెరికా జాయింట్ మిలిటరీ ఆపరేషన్ నిర్వహించాయి. అప్పటి నుంచి ఉత్తర కొరియా అగ్రరాజ్యంపై గుర్రుగా ఉంది. పదేపదే మిజైల్స్‌ టెస్ట్‌లు చేస్తూ కవ్విస్తోంది. ఈ కవ్వింపు చర్యలు మానుకోవాలని దక్షిణ కొరియా సంప్రదించే ప్రయత్నం చేసినా కిమ్ అసలు పట్టించుకోవడం లేదు. దీనిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలోనే అమెరికాకు కోపం తెప్పించే పని చేసింది బ్రిటన్. అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. ఎంత మిత్ర దేశమైనా సరే...నార్త్ కొరియాతో స్నేహం చేస్తే ఆంక్షలు తప్పవని తేల్చి చెప్పింది. ప్రపంచంలోనే అతి పెద్ద టొబాకో కంపెనీల్లో ఒకటైన British-American Tobacco Company (BATC) చేసిన పనితో అమెరికా బాగా హర్ట్ అయింది. ఇంతకీ ఈ కంపెనీ చేసిన పనేంటో తెలుసా..? నార్త్ కొరియాకు సిగరెట్లు అమ్మింది. సబ్సిడీకే ఉత్తర కొరియాకు సిగరెట్‌లు విక్రయించింది. నిబంధనలు ఉల్లంఘించి మరీ అక్రమంగా వీటిని అమ్మడంపై అమెరికా ఫైర్ అయింది. ఈ కంపెనీకి, ఉత్తర కొరియాకి మధ్య ఓ డీల్ కూడా కుదిరింది. 2007-17 మధ్య కాలంలో సిగరెట్‌లు విక్రయించే ఒప్పందం చేసుకున్నారు. అయితే..నార్త్ కొరియన్ సంస్థలకు సిగరెట్‌లు అమ్మేందుకు రూల్స్‌ కూడా మార్చేశారని అమెరికా తేల్చి చెప్పింది. అమెరికా ప్రభుత్వం పెట్టిన రూల్స్‌ని ఉల్లంఘించి మరీ ఉత్తర కొరియాకు రూ.35 వేల కోట్ల రూపాయల విలువ చేసే సిగరెట్‌లు విక్రయించినట్టు తేలింది. 


కిమ్..సిగరెట్ ప్రియుడు 


బ్రిటీష్ అమెరికన్ టొబాకో కంపెనీ తీరుపై మండిపడ్డ అమెరికా భారీ జరిమానా విధించింది. రూ.52 వేల కోట్లు ఫైన్ వేసింది. ముగ్గురు నార్త్ కొరియన్ బ్యాంకర్‌లపైనా క్రిమినల్ ఛార్జ్‌లు వేసింది. ప్రస్తుతానికి ఈ ముగ్గురూ పరారీలో ఉన్నారు. ఇంత స్కామ్ చేసింది ఎందుకో తెలుసా..? కిమ్‌కి బ్రిటీష్ అమెరికన్ టొబాకో కంపెనీ తయారు చేసే సిగరెట్‌లు అంటే చాలా ఇష్టం. స్మోకింగ్ అలవాటున్న కిమ్ చాలా సందర్భాల్లో సిగరెట్‌లు తాగుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. 2019లో వియత్నాంలో ఓ సమ్మిట్‌కి వెళ్లినప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సిగరెట్ తాగుతూ కనిపించారు కిమ్. ట్రైన్‌లో వెళ్తున్నప్పుడు తీసిన ఈ ఫోటో అప్పట్లో బాగా వైరల్ అయింది. గతేడాది మే నెలలోనే అమెరికా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నార్త్ కొరియాకు సిగరెట్‌లు అమ్మకుండా నిషేధం విధించాలని United Nations Security Council (UNSC)ని కోరింది. కానీ...నార్త్ కొరియా మిత్ర దేశాలైన చైనా, రష్యా ఈ తీర్మానాన్ని తిరస్కరించాయి. టొబాకో బిజినెస్ ద్వారా భారీ మొత్తంలో ఖజానా నింపుకుంటోంది ఉత్తర కొరియా. అందుకే...ఎలాంటి వేటు పడకుండా మిత్ర దేశాలను అడ్డు పెట్టుకుని వ్యాపారం సాగిస్తోంది. దక్షిణ కొరియాతో అమెరికా స్నేహం చేయడాన్ని తట్టుకోలేకపోతోంది నార్త్ కొరియా. ఇలాంటి సమయంలో తమకు భారీగా డబ్బులు తెచ్చి పెడుతున్న టొబాకో వ్యాపారంపై అమెరికా జోక్యం చేసుకోవడంపై ఎలా స్పందిస్తుందన్నదే ఉత్కంఠగా మారింది. 


Also Read: Flight Fighting: ఫ్లైట్‌లో కొట్టుకున్న మహిళా ప్యాసింజర్‌లు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ - నలుగురు అరెస్ట్