Rapido Driver Harassement:


ఎలహంకలో ఘటన 


కర్ణాటకలో ఓ ర్యాపిడో యూజర్‌కి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ 30 ఏళ్ల మహిళ ర్యాపిడోలో బైక్‌ రైడ్ బుక్ చేసుకుంది. బైక్ రాగానే ఎక్కి కూర్చుంది. కొంత దూరం వరకూ బాగానే ఉన్నా...ఉన్నట్టుండి ఆ మహిళను లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. వెంటనే అలెర్ట్ అయిన ఆ మహిళ బైక్ పై నుంచి దూకేసింది. నడి రోడ్డుపైనే ఈ సంఘటన జరిగింది. రాత్రి కావడం వల్ల ఆ రోడ్‌లో పెద్దగా వెహికిల్స్ ఏమీ లేవు. ఫలితంగా...ఆ మహిళకు ప్రమాదం తప్పింది. కింద పడగానే వెంటనే లేచి పరుగులు పెట్టింది. ఎలహంకలో ఇది జరిగినట్టు ఆ మహిళ వెల్లడించింది. ఆ డ్రైవర్‌ ఏపీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. బైక్ ఎక్కిన కాసేపటికే అసభ్యంగా తాకడం మొదలు పెట్టాడని, లైంగికంగా వేధించాడని...అతడి నుంచి తప్పించుకునేందుకు రోడ్డుపై దూకేశానని వివరించింది బాధితురాలు. ఏప్రిల్ 21న ఈ ఘటన జరగ్గా..ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలహంక పోలీస్‌ స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వెంటనే ఆ డ్రైవర్‌ని అరెస్ట్ చేశారు. 






ఫోన్ లాక్కుని...


రాత్రి 11.10 సమయంలో బాధితురాలు రైడ్ బుక్ చేసుకుంది. బైక్ ఎక్కిన వెంటనే ఫోన్ లాక్కున్నాడు. OTP చూసి ఇచ్చేస్తానని చెప్పాడు. ఆ తరవాత డ్రాప్ లొకేషన్ మార్చేశాడు. ఆపై ఆమెను అసభ్యంగా తాకాడు. ఇదంతా చూసి భయపడిపోయిన ఆ మహిళ వేరే దారి లేక బైక్ పై నుంచి దూకేసింది. ఆ డ్రైవర్‌ పేరు దీపక్‌ రావుగా గుర్తించారు పోలీసులు. ఆర్కిటెక్ట్‌గా పని చేస్తున్న ఆ మహిళ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. లైంగికంగా వేధిండమే కాకుండా...రాంగ్ లొకేషన్‌కి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడని అందుకే దూకానని చెప్పింది. మొబైల్‌ దొంగిలించాలని చూసినా వెంటనే లాక్కుని కిందకు దూకేసినట్టు వివరించింది. ఈ కేసు విచారణలో తేలిందేంటంటే...ఆ డ్రైవర్ ర్యాపిడోలో లింక్ చేసుకున్న బైక్ వేరు, సర్వీస్‌లకు యూజ్ చేస్తున్న బైక్ వేరు. అయితే...బాధితారులి స్నేహితురాలు పోలీసులపై మండి పడింది. ఇలా జరిగిందని చెబితే మొదట పట్టించుకోలేదని, ఇదేదో బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ మధ్య గొడవ అని కొట్టి పారేశారని ఆరోపించింది. అసలు విషయం తెలిశాక వెంటనే అరెస్ట్ చేశారు. 
 


 Also Read: Bengaluru: కిచెన్ బాత్‌రూమ్‌ అన్న తేడా లేదు, ఎక్కడ చూసినా మందు సీసాలే - ఓనర్‌కి షాకిచ్చిన బ్యాచ్‌లర్