Bengaluru:



పోస్ట్ వైరల్ 


బ్యాచ్‌లర్స్‌కి రూమ్ దొరకడం అంటే పెద్ద యుద్ధమే. ఇక ముంబయి, బెంగళూరు, పుణె, హైదరాబాద్ లాంటి సిటీల్లో అయితే నానా అవస్థలు పడాలి. ఓనర్స్ చెప్పిన కండీషన్స్ అన్నింటికీ ఒప్పుకోవాలి. కాదంటే మళ్లీ రోడ్డున పడటమే. ఎలాగోలా కష్టపడి ఓ ఫ్లాట్ సంపాదించుకుంటే అదే గొప్ప. సోషల్ మీడియాలో దీనిపై ఎప్పుడూ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. బ్యాచ్‌లర్లకి రూమ్‌ దొరకడం అంతే ఈజీ కాదు బ్రో అంటూ మీమ్స్ కూడా చేస్తుంటారు. సిటీల్లో బ్యాచ్‌లర్‌లకి రూమ్ ఇవ్వాలంటే చాలా కండీషన్స్ పెడతారు. ఒంటరిగా ఉంటానంటే కుదరదని కొందరు మొహం మీదే చెప్పేస్తారు. ఊరికే ఫ్రెండ్స్‌ని తెచ్చుకుని అల్లరి చేసినా ఖాళీ చేయాల్సిందే అని మరి కొందరు రూల్ పెడతారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటో తెలుసా..? ఫలానా వ్యక్తి ఎక్కడ పని చేస్తున్నాడో తెలుసుకోడానికి లింక్డిన్ ప్రొఫైల్స్ కూడా అడుగుతున్నారు ఓనర్లు. ఇన్ని చేసినా సరే చివరకు ఏదో విధంగా బ్యాచ్‌లర్స్ ఇబ్బంది పెడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు ఓనర్లు గగ్గోలు పెడుతున్నారు. Redditలో ఇప్పుడు దీని గురించే చర్చ జరుగుతోంది. బ్యాచ్‌లర్‌కి రూమ్ అద్దెకిచ్చిన ఓ ఓనర్ తనకు ఎదురైన అనుభవం గురించి పెద్ద పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. 


"నాకో 2BHK ఫ్లాట్ ఉంది. ఓ కుర్రాడు రెంట్‌కి కావాలని అడిగాడు. అన్ని వివరాలు కనుక్కొన్నా. చదువుకున్న వాడే కదా బుద్ధిగా ఉంటాడనుకుని అద్దెకిచ్చాను. MNCలో పని చేస్తున్నాడు. మూడు నాలుగు నెలలు బాగానే ఉన్నాడు. రెంట్ కూడా కరెక్ట్‌గా ఇచ్చాడు. ఆ తరవాత ఏమైందో తెలియదు. ఉన్నట్టుండి మాయమైపోయాడు. ఫ్లాట్‌ ఖాళీ చేస్తున్నాని చెప్పాడు. పైగా సెక్యూరిటి డిపాజిట్ వెనక్కి ఇచ్చేయాలని గొడవ పెట్టాడు. సరే ఈ గొడవంతా నాకెందుకులే అని ఖాళీ చేయమని చెప్పేశాను"


- ఫ్లాట్ ఓనర్ 


ఇంటినిండా మందు సీసాలే 


ఇక్కడి వరకూ కథ ఇది. కానీ ఆ తరవాతే అసలు ట్విస్ట్ ఉంది. ఎలాగోలా ఆ బ్యాచ్‌లర్ చేత ఖాళీ చేయించిన ఓనర్ "ఫ్లాట్ ఎలా ఉందో చూసొద్దాం" అని వెళ్లాడు. అలా తలుపు తీశాడో లేదో. స్టన్ అయిపోయాడు. ఎక్కడ చూసిన ఖాళీ లిక్కర్ బాటిల్స్‌ ఉన్నాయి. అది ఇల్లా బారా అర్థం కాలేదు. కిటికీలు అన్నీ తెరచి పెట్టాడు. పావురాలు వచ్చి ఇల్లంతా పాడు చేశాయి. ఇక్కడ అక్కడ అని కాదు. ఇంట్లో ఎక్కడ చూసినా చెత్త చెత్తగా ఉంది. ఎక్కడపడితే అక్కడ లిక్కర్ సీసాలు కనిపించాయి. ఇది చూసిన ఓనర్ షాక్ అయ్యాడు. ఈ చేదు అనుభవాన్నంతా రెడిట్‌ సైట్‌లో పంచుకున్నాడు. అందుకే బ్యాచ్‌లర్‌లకు రూమ్ ఇవ్వొద్దు అంటూ తన బాధంతా వెళ్లబోసుకున్నాడు. ఇది చూసిన నెటిజన్‌లు రకరకాల కామెంట్‌లు పెడుతున్నారు. అందరూ ఒకేలా ఉంటారా..? అని కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికైతే ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. 


Also Read: Kejriwal House Renovation: కేజ్రీవాల్ "ఇంటి" చుట్టూ రాజకీయాలు, ఆప్ బీజేపీ మధ్య పొలిటికల్ వార్