US Mid-Term Polls: అమెరికాలో మరో భారతీయ సంతతి వ్యక్తి సత్తా చాటారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ అమెరికన్ నబీలా సయ్యద్ చరిత్ర సృష్టించారు. 23 ఏళ్లకే ఇల్లినాయిస్ రాష్ట్ర చట్ట సభకు ఎన్నికై రికార్డు నెలకొల్పారు.
రికార్డు
డెమోక్రాటిక్ పార్టీకి చెందిన నబీలా మధ్యంతర ఎన్నికల్లో భాగంగా ఇల్లినాయిస్ 51వ డిస్ట్రిక్ నుంచి ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీకి చెందిన క్రిస్ బోస్‌పై ఆమె గెలుపొందారు. ఈ ఎన్నికల్లో నబీలాకు 52.3 శాతం ఓట్లు వచ్చాయి.
విజయంపై
ప్రజలతో మమేకమవ్వడం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆమె అన్నారు. తనకు వెన్నంటి ఉంటూ మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి నబీలా సయ్యద్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవల
అమెరికాలో లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఎన్నికై ఇండియన్ అమెరికన్ అరుణ మిల్లర్ ఇటీవల రికార్డు సృష్టించారు. ఆమె మేరీలాండ్‌కు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ బాధ్యతలు చేపట్టారు. అమెరికాకు వలస వచ్చి ఈ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఇటీవల జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఆమె ఎల్‌జీగా గెలుపొందారు. విజయం సాధించిన వెంటనే అరుణ మిల్లర్ ట్విటర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
"నన్ను గెలిపించిన వారందరికీ ధన్యవాదాలు. మీ నిబద్ధతకు, మద్దతుకి కృతజ్ఞతలు" అని ట్వీట్ చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భారత సంతతికి చెందిన వారే. ఇప్పుడు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ హోదాలోనూ మన ఇండియన్స్ రాణించటం గొప్ప విషయమే.
Also Read: Tamil Nadu Rains: తమిళనాడులో వరుణుడి బీభత్సం- 23 జిల్లాల్లో విద్యాసంస్థలు బంద్!