Tamil Nadu Rains: తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (Rains) కురుస్తున్నాయి. దీంతో 23 జిల్లాల్లోని పాఠశాలలకు (Schools) తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం సెలవు (Holiday) ప్రకటించింది. చెన్నైలో రాత్రిపూట కురిసిన వర్షాలకు ఇప్పటికే నగరంలోని కొన్ని ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి.
విల్లుపురం, తిరువణ్ణామలై, రామనాథపురం, తిరుచ్చి, కడలూరు, పుదుకోట్టై, పెరంబలూరు, అరియలూరు, కళ్లకురిచ్చి జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. చెన్నైలోని పాఠశాలలు, కళాశాలలు కూడా మూసివేశారు. పుదుచ్చేరి అధికార యంత్రాంగం.. శుక్ర, శనివారాల్లో కారైకల్ ప్రాంతాలతో సహా యూటీలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది.
నీటిలో నగరం
చెన్నైలో రాత్రిపూట కురిసిన వర్షాలకు అయ్యపంతంగల్, పులియంతోప్, వ్యాసర్‌పాడి తదితర ప్రాంతాల్లోని రహదారులు జలమయం అయ్యాయి. తిరువళ్లూరు, రాణిపేట్, కాంచీపురం జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
తమిళనాడులోని ధర్మపురి, సేలం, నమక్కల్, కరూర్, పుదుక్కోట్టై, శివగంగ, రామనాథపురం, విరుదునగర్, మదురై, తేని, దిండిగల్, తిరుప్పూర్, కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎమ్‌డీ పేర్కొంది.
Also Read: Odisha News: ఫుల్లుగా సారా తాగేసి హాయిగా బజ్జున్న 24 ఏనుగులు!