రుక్మిణి ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి సిద్ధపడుతుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ అని రామూర్తి అడుగుతాడు. ఏదో ఒక రోజు ఇది జరుగుతుందని ముందే చెప్పాను అది వచ్చేసింది నేను వెళ్తున్నా మీరు అమ్మని బాగా చూసుకోండి అని చెప్తుంది. ‘ఇంటి నుంచి వెళ్తు నీ గురించి కాకుండా మా గురించి ఆలోచిస్తున్నావ్ చూడు నీకు మేము చాలా రుణపడి ఉంటాం. నేను జానకిని తీసుకుని కేరళ వెళ్తున్నా, నువ్వు ఆఫీసర్ బాబు సంతోషంగా ఉండండి’ అని రామూర్తి చెప్తాడు. దేవుడమ్మ రుక్మిణితో మాట్లాడిన విషయం గురించి ఆలోచిస్తుంటే ఆదిత్య వచ్చి ఏంటమ్మా అలా ఉన్నావ్ అని అడుగుతాడు. దేవుడమ్మ కోపంగా ఆదిత్య చెంప పగలగొడుతుంది.


దేవుడమ్మ: నిన్న గుడిలో నీతో పాటు దీపాలు వెలిగించింది ఎవరు? చెప్పు ఎవరితో కలిసి దీపాలు వెలిగించావ్.. పోనీ నేను చెప్పనా.. నువ్వు దాచిపెట్టినంత మాత్రాన తెలియదు అనుకున్నావా? నీతో దీపాలు వెలిగించింది రుక్మిణి కదా. తనని నువ్వు కలవడమే కాదు నేను కలిశాను


రాజమ్మ: మన రుక్మిణి బతికే ఉందనే నీ నమ్మకం నిజమే


సూరి: ఎక్కడ ఉంది వదినమ్మ


దేవుడమ్మ: నేను నిన్న కలిశాను కానీ వీళ్ళు చాలా రోజుల నుంచి కలుస్తున్నారు


ఈశ్వరప్రసాద్: నువ్వు ఎలా కలిశావ్


Also read: వేదనే తన జీవితమన్న యశోధర్- కోడలిని ఆకాశానికెత్తేసిన మాలిని


దేవుడమ్మ: నిన్న వీడు నిద్రపోతున్నపుడు వీడి ఫోన్లో రుక్మిణి నెంబర్ తీసుకున్నాను. వీడికి యాక్సిడెంట్ అయినట్టుగా రుక్మిణికి ఫోన్ చేయించాను. ఆ మాట వినగానే చెప్పిన చోటుకి పరిగెత్తుకుంటూ వచ్చింది


అటు సత్య చెంప పగలగొడుతుంది భాగ్యమ్మ. నేను నిన్న బాగుండాలని కోరుకుంటే నా భర్తతో కలిసి ఎందుకు దీపాలు వెలిగించిందని భాగ్యమ్మని ప్రశ్నిస్తుంది. అవును తన భర్తతో వెలిగిస్తే తప్పేంటి అని భాగ్యమ్మ అంటుంది. ఆదిత్య నా భర్త.. తన భర్త మాధవ్ ఉన్నాడు కదా తనతో దీపాలు వెలిగించొచ్చు కదా అని సత్య కోపంగా అంటుంది. మాధవ్ రుక్కవ్వ భర్త కాదని అటు భాగ్యమ్మ ఇటు ఇంట్లో ఆదిత్య గట్టిగా చెప్తారు.


ఆదిత్య: నా భార్యని మాధవ్ భార్య అని అందరూ అంటుంటే నరకం అనుభవించాను. కష్టాల్లో ఉన్నప్పుడు ఆ ఇంటికి చేరింది, ఆ ఇంటి మనిషిగా ఉంది అంతే కానీ ఆ ఇంట్లో ఎవరికి ఏమి కాదు


సత్య: నువ్వు చెప్పేది నిజమా


భాగ్యమ్మ: మాధవ్ గాడు ఏది చెప్తే అది నమ్ముతావా నువ్వు


ఆదిత్య: రుక్మిణి సత్య కోసం చేసిన త్యాగం అడ్డం పెట్టుకుని తనని భార్యగా చెప్పుకుంటున్నాడు, నేనేమీ చేయలేకపోతున్నా


భాగ్యమ్మ: ఆ ఇల్లు విడిచిపెట్టి ఈ ఇంటికి వస్తే నీ కాపురం ఎక్కడ నాశనం అవుతుందో అని భయం. ఇంటికి రమ్మంటే ఏమంటుందో తెలుసా.. నా చెల్లి పటేల్ ని ప్రాణంగా ప్రేమించింది వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలనే కదా ఇల్లు విడిచి పెట్టి వచ్చింది. ఆ మాధవ్ గాడు ఎన్ని బాధలు పెట్టినా ఆ ఇంటికి రాలేదు అది నా రుక్కవ్వ అంటే. నిజం తెలిస్తే తను కాకపోయినా బిడ్డ అయినా అడ్డం వస్తుందేమో అని తనకి ఆదిత్య బాబే తండ్రి అని కూడా చెప్పలేదు


Also Read: నందు వాళ్ళని బకరాల్ని చేసిన పరంధామయ్య- సామ్రాట్ ని ఫుట్ బాల్ ఆడుకున్న పెద్దాయన


దేవుడమ్మ: మనసులో ఇంత బాధపెట్టుకుని ఇంతకాలం ఎంత నరకం అనుభవించావో అర్థం అయ్యింది


ఆదిత్య: నీకు ఎలా చెప్తే అర్థం చేసుకుంటావో అని భయం వేసి చెప్పలేకపోయాను. కళ్ళ ముందు కూతురు తిరుగుతున్నా నేనే నీ నాన్న అని బిడ్డకి చెప్పలేకపోయాను


దేవుడమ్మ: ఎక్కడ ఉంది నా మనవరాలు


దేవి అప్పుడే ఇంటికి వస్తుంది. ఇంతకాలం నీకు చెప్పలేకపోయిన నిజం ఇదే. దేవినే నా కూతురు. కళ్ళ ముందే తిరుగుతున్నా నా మనవరాలు నాకు ఇంత దగ్గర అయినా తెలుసుకోలేకపోయాను అని దేవుడమ్మ ఎమోషనల్ అవుతుంది. ఇంట్లో అందరూ చాలా సంతోషిస్తారు. ఆఫీసర్ సారు మీ నాన్నే అని దేవుడమ్మ చెప్తుంది. నువ్వు అడిగిన మీ నాన్నని నేనే అని ఆదిత్య కూడా చెప్తాడు. ఈ ఇల్లు తన ఇల్లని తనకి తెలిసని మాయమ్మ చెప్పేదాక నేను కూడా చెప్పకూడదు అనుకున్నా అని దేవి నిజం బయటపెట్టేస్తుంది.