Pawan Kalyan PM Modi Meeting: విశాఖపట్నంలో ఈ రోజు రాత్రి (నవంబరు 11) నుంచి ప్రధాని మోదీ (PM Modi Vizag Tour) పర్యటించనున్నారు. తమిళనాడు నుంచి నేరుగా విశాఖపట్నానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ లో పాల్గొననున్నారు. అయితే, మోదీ పర్యటనలో ఆసక్తికరమైన మరో అంశం ఒకటి ఉంది. అదే.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో సమావేశం. అందుకోసం ఈ రోజు (నవంబరు 11)  సాయంత్రానికే విశాఖపట్నానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేరుకోనున్నారు. ప్రధానితో పాటు మూడు రోజులు విశాఖపట్నంలోనే ఉండనున్నారు. 


ఇటీవల కాలంలో వైఎస్ఆర్ సీపీపై (YSRCP) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్వరం పెంచిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ నాయకులపై దూషణలకు కూడా వెనుకాడటం లేదు. ఇదే టైంలో పవన్ కు మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) నాయుడు సంఘీభావం తెలపటం.. ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరమైతే అందరం కలిసి పోరాడాలని స్టేట్ మెంట్లు ఇవ్వటం ఇవన్నీ 2014 ఎన్నికల పొత్తు సీన్ ను రిపీట్ చేయటానికే అనే సూచనలు వెలువడుతున్నాయి. వైఎస్ఆర్ సీపీ కూడా అదే చెబుతోంది. నిన్న కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) మాట్లాడుతూ.. టీడీపీ-జనసేన (TDP Janasena) కలవటానికి స్టేజ్ ప్రిపరేషన్ జరుగుతోంది అని అన్నారు. 


మరి ఈ టైంలో ప్రధాని మోదీతో భేటీ కానున్న పవన్ కల్యాణ్.. ఆయనకు రాష్ట్ర పరిస్థితులు వివరించటంతో పాటు ఇంకేం చెబుతున్నారన్నదే కీలక అంశంగా మారింది. వైఎస్ఆర్ సీపీ నాయకుల ఆరోపణలైతే  బాబు - మోదీ మళ్లీ కలవటానికి పవన్ కల్యాణ్ ప్రయత్నం చేస్తున్నారన్నట్లు ఉన్నాయి. మరి నిజంగానే పవన్ కల్యాణ్ ఆ పని చేస్తారా? లేదా కేవలం బీజేపీతో మాత్రమే కలిసి.. వచ్చే ఎన్నికలకు వెళ్లేలా ప్రధాని నుంచి రోడ్ మ్యాప్ తీసుకుంటారా అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2014 లో పవన్, బాబు, మోదీ కలిస్తే 1+1+1 త్రీ కాదు 111 అని  ప్రధాని మోదీ చెప్పిన ఫార్మూలా మళ్లీ వర్కవుట్ చేస్తారా అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.


అయితే, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) 2014 ఫార్ములా దిశగానే ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ - జనసేన పొత్తు పెట్టుకున్న నాటి నుంచి ప్రభుత్వ వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేపట్టినా రెండు పార్టీలూ కలిసి పోరాడిన సందర్భాలు దాదాపుగా లేవు. అంతేకాక, మొన్నామధ్య చంద్రబాబు పవన్ కల్యాణ్‌ను కలిసిన తర్వాత జనసేన బీజేపీని వీడుతుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ, పవన్, బాబు, మోదీ కలిస్తే అధికార పార్టీని గద్దె దించేందుకు మరింత అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ మూడు పార్టీల కూటమికి ప్రయత్నిస్తున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.