UP Election 2022: ఆ సీఎంపై యూపీ పోలీసుల ఎఫ్ఐఆర్.. ఇదెక్కడి న్యాయమని ముఖ్యమంత్రి ఫైర్

ABP Desam Updated at: 17 Jan 2022 03:45 PM (IST)
Edited By: Murali Krishna

తనపై ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్ బఘేల్ అభ్యంతరం తెలిపారు. భాజపాపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు.

బఘేల్‌పై ఎఫ్ఐఆర్

NEXT PREV

ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్ బఘేల్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం విధించిన కరోనా మార్గదర్శకాలను ఉల్లంఘించి నోయిడాలో బఘేల్ ఇంటింటి ప్రచారం నిర్వహించారని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. కొవిడ్ కేసులు పెరిగిన కారణంగా జనవరి 22 వరకు బహిరంగ ర్యాలీలు, సభలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది.


అయితే తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై భూపేశ్ బఘేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపించారు.







నా ఒక్కడి మీదే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదైంది? ఇలా అయితే ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది? భాజపా కూడా ఎన్నికల ప్రచారం చేస్తుంది కదా.. వారిపై ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఈసీ పక్షపాత ధోరణి మొదట్లోనే తెలిసిపోయింది. నేను మళ్లీ యూపీ వెళ్తాను. ప్రచారం చేయకూడదంటే మేం ఏం చేస్తాం? ఎన్నికల ప్రచారం ఎలా నిర్వహించాలో ఈసీ ఒకసారి చూపిస్తే బావుంటుంది. అప్పుడు కచ్చితంగా అలానే మేం చేస్తాం. భాజపా 5 రోజుల నుంచి ఇంటింటి ప్రచారం నిర్వహించింది. వారిపై ఒక్క కేసు కూడా పెట్టలేదు. నేను ఒక్కరోజు ప్రచారం చేస్తే కేసు పెట్టేశారు. ఈసీ ఇది న్యాయమేనా?                                                        -      భూపేశ్ బఘేల్. ఛత్తీస్‌గఢ్‌ సీఎం


Also Read: Covid Vaccine for Children: గుడ్‌న్యూస్.. 12-14 ఏళ్ల పిల్లలకు అప్పటి నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ!


Also Read: Omicron Cases: భారత్‌లో కాస్త శాంతించిన కరోనా మహమ్మారి.. మరోవైపు 8 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Published at: 17 Jan 2022 03:45 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.