కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పుల్వామా జిల్లా లెత్‌పొరాలో ఉన్న సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌ను సందర్శించారు. మూడు రోజుల జమ్ము పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్లారు. అక్కడ ఉన్న బలగాలతో కాసేపు మాట్లాడారు. ఆయుధ సామగ్రిని పరిశీలించారు.
కశ్మీర్‌లో ఒకప్పుడు రాళ్ల దాడులు ఎక్కువగా జరిగేవి. కానీ ప్రస్తుతం అలాంటి ఘటనలు గణనీయంగా తగ్గాయి. ఉగ్రవాదాన్ని మోదీ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. మానవతావాదానికి ఇది వ్యతిరేకం. - అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
మూడు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు అమిత్ షా శ్రీకారం చుట్టారు. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. జమ్ముకశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నించేవారిని వదిలిపెట్టేదిలేదని హెచ్చరించారు. జమ్ముకశ్మీర్‌లోని ఐఐటీ-జమ్ము కొత్త క్యాంపస్‌ను ఆయన ఇటీవల ప్రారంభించారు.
" జమ్ముకశ్మీర్ ప్రజలకు అన్యాయం జరిగే సమయం అయిపోయింది. అది చెప్పేందుకే నేను జమ్ము వచ్చాను. ఎవరూ మీకు అన్యాయం చేయలేరు. ఇక్కడ జరుగుతోన్న అభివృద్ధిని అడ్డుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ జరిగే అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. జమ్ముకశ్మీర్.. ఎన్నో ఆలయాలకు నెలవు. మాతా వైష్ణో దేవి ఆలయం ఇక్కడే ఉంది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, ప్రేమ్ నాథ్ డోగ్రా వంటి వారి ప్రాణత్యాగానికి ఈ జమ్ముకశ్మీర్ ప్రతీక. ఇక్కడ అశాంతి నెలకొల్పాలని చూసేవారిని మేం సహించం. "
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
స్థానిక రాజకీయ పక్షాలపై కూడా అమిత్ షా విమర్శలు గుప్పించారు. కశ్మీర్ ప్రజలను ఇన్నాళ్లు దోచుకున్న వారు ఇప్పుడు అభివృద్ధిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
Also Read: Mumbai News: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. వాంఖడేపై విజిలెన్స్ విచారణ!
Also Read: UP Polls 2022: ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు ప్రియాంక వాగ్దానం.. ఈసారి ఉచిత వైద్యంపై హామీ
Also Read: Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?
Also Read: Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు