నీట్‌లో రిజర్వేషన్ల చెల్లుబాటుపై నిర్ణయం తీసుకునే వరకు కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని సుప్రీం కోర్టు చేసిన సూచనను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. రిజర్వేషన్లపై నిర్ణయం తేలకుండా కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తే విద్యార్థులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సిన వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. నీట్​లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ కోటాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకు పీజీ కౌన్సిలింగ్‌ నిర్వహించబోమంటూ కేంద్రం సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చింది.


2021-22 విద్యాసంవత్సరం నుంచి 15 శాతం యూజీ, 50 శాతం పీజీ ఆల్‌ ఇండియా కోటా(AIQ) సీట్లలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్​ కేటగిరీకి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ పలువురు గత నెలలో కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.


జస్టీస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వం, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్షయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈరోజు విచారణ చేపట్టింది. ఆల్ ఇండియా కోటా (AIQ)లో కేంద్రం ప్రవేశ పెట్టిన ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల చెల్లుబాటుపై తాము నిర్ణయం తీసుకునే వరకు కౌన్సిలింగ్ నిర్వహించవద్దని సుప్రీం ధర్మాసనం కేంద్రానికి స్పష్టం చేసింది.


తాము నిర్ణయం తీసుకోవడానికి ముందే కౌన్సిలింగ్ ను నిర్వహిస్తే విద్యార్థులు నష్టపోతారని కోర్టు అభిప్రాయపడింది. దీంతో తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు నీట్-పీజీ కౌన్సిలింగ్​ నిర్వహించబోమని కేంద్ర ప్రభుత్వం తరపున..సుప్రీంకోర్టుకి అడిషనల్ సొలిసిటర్ జనరల్ నటరాజ్ హామీ ఇచ్చారు.


దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ లేదా పీజీ మెడిసిన్ వైద్య విద్యలో అడ్మిషన్‌కు జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష నీట్‌లో అర్హత తప్పనిసరి. పీజీ నీట్‌లో అర్హత పొందిన విద్యార్ధులు కౌన్సిలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. రాష్ట్ర నీట్ పీజీ కోటా సీట్ల భర్తీకై కౌన్సిలింగ్‌ను సంబంధిత రాష్ట్ర వైద్య కౌన్సిలింగ్ కమిటీలు నిర్వహిస్తాయని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ప్రకటించింది. 50 శాతం ఆల్ ఇండియా కోటా, డీమ్డ్ , సెంట్రల్ యూనివర్శిటీలు, ఇతర విద్యాసంస్థల్లో సీట్ల భర్తీకు నీట్ పీజీ కౌన్సిలింగ్ ప్రక్రియను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. డీమ్డ్ , సెంట్రల్ యూనివర్శిటీ సీట్లు, పీజీ డీఎన్‌బీ సీట్ల ప్రవేశం కోసం అదనపు రౌండ్ ఉంటుంది. మిగిలిన సీట్ల కోసం చివరిలో మరో రౌండ్ కౌన్సిలింగ్ ఉంటుంది.


Also Read: Mumbai News: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. వాంఖడేపై విజిలెన్స్ విచారణ!


Also Read: UP Polls 2022: ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు ప్రియాంక వాగ్దానం.. ఈసారి ఉచిత వైద్యంపై హామీ


Also Read: Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?


Also Read: Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి