Mumbai News: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్.. వాంఖడేపై విజిలెన్స్ విచారణ!

ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడేపై ఆ సంస్థ విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ముగ్గురు సభ్యుల బృందం రేపు ముంబయి వెళ్లి ఆయనపై వస్తోన్న అవినీతి ఆరోపణలపై విచారణ చేయనుంది.

Continues below advertisement

ముంబయి డ్రగ్స్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడేను టార్గెట్ చేస్తూ మహారాష్ట్ర మంత్రులు చేస్తోన్న ఆరోపణలపై ఆ సంస్థ విచారణ చేపట్టాలని నిర్ణయించింది.

Continues below advertisement

ముగ్గురు సభ్యుల ఎన్‌సీబీ బృందం దిల్లీ నుంచి రేపు ముంబయి వెళ్లి వాంఖడేపై వస్తోన్న అవినీతి ఆరోపణలపై విచారణ చేయనుంది. ఈ బృందంలో ఎన్‌సీబీ డీడీజీ జ్ఞానేశ్వర్ సింగ్ సహా ఇద్దరు ఇన్స్‌పెక్టర్ స్థాయి అధికారులు ఉన్నట్లు సమాచారం.

ఇవే ఆరోపణలు..

డ్రగ్స్ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ అనే వ్యక్తి దర్యాప్తు సంస్థ ఎన్‌సీబీపై ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న గోసవీ- దర్యాప్తు సంస్థ మధ్య రహస్య ఒప్పందం, ముడుపుల వ్యవహారం నడుస్తోందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసులో ఎన్‌సీబీ తనతో బ్లాంక్ పంచనామాపై బలవంతంగా సంతకం చేయించుకుందాని ఆరోపించాడు.

ఎవరీ ప్రభాకర్?

ముంబయి క్రూజ్ డ్రగ్స్ కేసులో మొత్తం తొమ్మిది మందిని ఎన్‌సీబీ సాక్షులుగా పేర్కొంది. వారిలో ప్రైవేట్ డిటెక్టివ్ కేపీ గోసవీ కూడా ఒకరు. ఆయన బాడీగార్డుగా చెప్పుకుంటున్న ప్రభాకర్ సెయిల్‌ను కూడా ఎన్‌సీబీ విచారించింది. అయితే ఆయన ఎన్‌సీబీపై సంచలన ఆరోపణలు చేశాడు. ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నుంచి తనకు ప్రాణాపాయం ఉందని తెలిపాడు. ప్రస్తుతం గోసవీ అజ్ఞాతంలో ఉన్నారు. 

Also Read: UP Polls 2022: ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలకు ప్రియాంక వాగ్దానం.. ఈసారి ఉచిత వైద్యంపై హామీ

Also Read: Study: కరోనా వ్యాక్సిన్ ఇతర వ్యాధుల మరణాల రేటును కూడా ప్రభావితం చేస్తుందా?

Also Read: Corona virus: కరోనా కారణంగా భారతీయుల ఆయుర్ధాయం తగ్గిపోయిందా? కొత్త అధ్యయనంలో కలవరపెట్టే నిజాలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola