ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో భారత ఓటమి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కోహ్లీసేన ఓటమి పాలైనా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బాణసంచా కాల్చడం చర్చనీయంశంగా మారింది. దీపావళికి టపాకాయలను నిషేధించిన ప్రభుత్వం ఆదివారం అనుమతి ఇవ్వడం వంచనే అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. మరోవైపు పాక్ గెలుపు 'ఇస్లాం విజయం'అని పాక్ ఇంటీరియర్ మినిస్టర్ అంటున్నాడు. భారత ముస్లింలూ తమవైపే ఉన్నారని అవాకులు చవాకులు పేలాడు.
మెగా టోర్నీల్లో భారత్, పాక్ తలపడిన ప్రతిసారీ మ్యాచుకు ముందు, తర్వాత సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. అయితే ఆదివారం టీమ్‌ఇండియా ఓడిపోయాక శ్రీనగర్, మరికొన్ని ప్రాంతాల్లో కొందరు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. దీనిపై ట్విటర్లో విమర్శలు వస్తున్నాయి.
'దీపావళి సమయంలో బాణసంచా నిషేధిస్తారు. కానీ ఆదివారం మాత్రం దేశంలోని చాలా ప్రాంతాల్లో టపాసులు పేల్చి పాకిస్థాన్ విజయం పట్ల సంబరాలు చేసుకున్నారు. బహుశా వాళ్లు క్రికెట్ సాధించిన విజయాన్ని వేడుక చేసుకున్నారేమో! అలాంటప్పుడు దీపావళికి మాత్రం బాణసంచా పేలిస్తే వచ్చే నష్టమేంటి? వంచన ఎందుకు? మొత్తం జ్ఞానమంతా ఇప్పుడే కలుగుతుందా ఏంటి?' అని సెహ్వాగ్ ప్రశ్నించాడు. అంతకు ముందు విజయం సాధించినందుకు పాక్‌ను అతడు అభినందించాడు.
పాక్ విజయం సాధించడంలో బాణసంచా కాల్చిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. ఎందుకిలా చేస్తున్నారని వీటిపై చర్చలు సాగుతున్నాయి. మరోవైపు పాక్ ఇంటీరియర్ మినిస్టర్ అవాకులు చవాకులు పేలాడు. పాక్ గెలుపు ఇస్లాం విజయమని, భారత ముస్లింలు తమవైపే ఉన్నాడని అన్నాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్లో చక్కర్లు కొడుతోంది.
'విజయం సాధించిన పాక్‌కు అభినందనలు. పట్టుదలతో ప్రత్యర్థిని ఓడించారు. పాక్ సత్తా ఏంటో ముస్లిం ప్రపంచం ముందు ప్రదర్శించారు. మనకు ఇదే టీ20 ప్రపంచకప్ ఫైనల్. అందుకే దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకొనేందుకు నగరాల్లో బారికేడ్లను తొలగించాలని ఆదేశించాను. భారత్ సహా ప్రపంచంలోని ముస్లింలందరి మద్దతు పాక్‌కు ఉంది. ఇది ముస్లిం ప్రపంచం విజయం' అని పాక్ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ అన్నాడు. ఓ వీడియో ట్వీటూ వదిలాడు.
Also Read: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్ ముందు యాంటీ క్లైమాక్స్! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?
Also Read: పాక్ విజయానికి 'పంచ సూత్రాలు'.. కోహ్లీసేన పరాభవానికి కారణాలు! మిస్టేక్ అయింది ఇక్కడే..!
Also Read: India Vs Pakistan: నిన్న వెస్టిండీస్.. నేడు టీమిండియా.. ‘6’ సెంటిమెంట్ వెక్కిరించిందా?
Also Read: IND vs PAK, Match Highlights: దాయాది చేతిలో దారుణ ఓటమి.. పాక్‌పై పది వికెట్లతో చిత్తయిన టీమిండియా!